Wednesday, June 26, 2013

తుమ్మెదా తుమ్మెదా

చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా..గోవిందుడున్నాడు గోపాలుడున్నాడు
గోవిందుడున్నాడు గోపాలుడున్నాడు...గోరంత కబురందితే
కొండ దిగి వస్తాడు... కోన దాటి వస్తాడు
సత్యం...సత్యం...సత్యం.. సత్యం..ఇది సత్యం..
భయం..భయం..నభయం..నభయం..అభయం..అభయం..అభయం..

తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా...ముందు ముందుంది ముసళ్ళ పండగా

చరణం 1:

మల్లెపొద చుట్టూ ముళ్ళ కంచెలున్నాయి...
కంచె దాటి వచ్చినా కందిరీగలున్నాయి...
మల్లెపొద చుట్టూ ముళ్ళ కంచెలున్నాయి...
కంచె దాటి వచ్చినా కందిరీగలున్నాయి...

అందుకోవాలంటే ఓ తుమ్మెదా... ఆదుకోవాలంటే నా తుమ్మెదా
అడుగడుగున సుడిగుండాలున్నాయి...

ఉన్నా ఏమున్నా ఎవరున్నా...ఎవరున్నా ఏమున్నా ఉన్నా
మీ నాన్నున్నా ఉన్నా నేనున్నా...ఈ నాన్నున్నా ఉన్నా నేనున్నా

ఆ...ఆ..ఆ.. తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా...ముందు ముందుంది ముసళ్ళ పండగా

చరణం 2:

ఎంత చక్కని వాడో అంత టక్కరివాడు...
ఎంతకూ ఓయమ్మో చిక్కనివాడు... అంతు చిక్కనివాడు...

ఎదురుగ ఉన్నాడు ఓ తుమ్మెదా... ఎదలోనే ఉన్నాడు నా తుమ్మెదా
అదురెందుకు బెదురెందుకు నా దానివన్నాడు
ఔ..ఔ..అయ్..ఊ..ఔ..ఊ..
శబ్ధం...శబ్ధం..నిశబ్ధం..
ష్..శబ్ధం...నిశబ్ధం..నిశబ్ధం..శబ్ధం..
శబ్ధం..నిశబ్ధం..శబ్ధం..నిశబ్ధం..

తుమ్మెదా తుమ్మెదా ...తొందర పడకు తుమ్మెదా
ముందుంది ముసళ్ళ పండగా...ముందు ముందుంది ముసళ్ళ పండగా

No comments:

Post a Comment