చిత్రం: జీవన తీరాలు (1977)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వీటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. ఆ కెరటం కావాలని..
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. ఆ కెరటం కావాలని..
ఎందుకో ఆ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
కెరటానికి ఆరాటం.. తీరం చేరాలని..
చరణం 1:
కురులపై మెరిసే చినుకులు.. ఆణిముత్యాలై
తనువుపై కురిసే చినుకులు.. తడితడి ముచ్చటలై..
మది లోపలి తెర తీసి... మారాము చేస్తుంటే...
మది లోపలి తెర తీసి... మారాము చేస్తుంటే...
పదునైన కోరిక ఏదో పెదవినే గురి చూస్తుంది..
ఎందుకో ఈ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
చరణం 2:
ఏమి వెన్నెల ఎంతకూ మన ఇద్దరి పైనే పడుతున్నది
తనకు దాహం వేసిందేమో.. మనలనల్లరి పెడుతున్నది
ఎంతెంత దగ్గరగా...ఆ... ఇద్దరమూ ఉన్నా...
మరికాస్తా... ఇంకాస్తా.. ఒదిగిపొమ్మని...
మౌనంగా ఉరుముతున్నది... వెన్నెల ఉరుముతున్నది
ఎందుకో ఈ ఆరాటం.. అందుకే...
అందుకే.. ఆ ఉబలాటం
చరణం 3:
ఇది వసంతమని తెలుసు.. కోయిల పాటలకు
ఇదే మూలమని తెలుసు.. తీయని పంటలకు
లలిత లలిత యువ పవన చలిత పల్లవ దళాలలోనా
రమణీయ కుసుమ రమణీరంజిత నమరగీతిలోనా..
నవనవలాడే అనుభవమేదో.. నన్నే అలగా మలచుకున్నది
నన్నే అలగా మలచుకున్నది
అందుకే ఈ ఆరాటం.. ఇందుకే..
ఇందుకే.. ఆ ఉబలాటం...
కెరటానికి ఆరాటం.. అహహ..
తీరం చేరాలని..
తీరానికి ఉబలాటం.. అహహ
ఆ కెరటం కావాలని..
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
లలలాలలలా... లాలాలాలాలలాలాలల...
No comments:
Post a Comment