చిత్రం : దేవుడే గెలిచాడు (1976)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : అప్పలాచార్య
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
పులకింతలు ఒక వెయ్యి.. కౌగలింతలు ఒక కోటి
నిన్ను కలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...
చరణం 1 :
నీ మగసిరి ఒడుపున ఉరవడిలో... నా సొగసుల పండుగ చేసేను
నీ కోర చూపుల వెచ్చదనంలో... కోరిక నేనై మిగిలేను
జన్మ జన్మలకు నిన్నే ..నిన్నే కొలిచేను .. కొలిచేను...
రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...
చరణం 2 :
నీ నవ్వులలో విరజాజులు విరిసినవి
నీ కన్నులలో సిరిమల్లెలు పూసినవి
ఎంత చూసినా ... ఏమి చేసినా
తనివి తీరనంటుంది ... మనసు నిలవనంటుంది
రజినీ .. విజయ్ ...
రజినీ .. విజయ్ ...
చరణం 3 :
మనిషి పోయినా... మనసు మిగిలి ఉంటుంది
ప్రేమించే గుణం దాన్ని వదలంటుంది .. వదలంటుంది
మన కలలు పండి .. మనసు నిండి
నిగి నేల నిలిచేదాక నిలవాలి .. మన ప్రేమ నిలవాలి
పులకింతలు ఒక వెయ్యి.. కౌగలింతలు ఒక కోటి
నిన్ను కలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
మనసారా పిలవమంటున్నవి
రజినీ ..రజినీ
రజినీ .. రజినీ
రజినీ ..రజినీ
రజినీ .. రజినీ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3597 | |
No comments:
Post a Comment