Wednesday, July 17, 2013

రేపంటి రూపంకంటి

చిత్రం: జోకర్ (1993)
సంగీతం: వంశీ
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి:

రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి

రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి

ఇటురా త్వరగా ఇకమా త్వరగా
వెతికే చెలిమి కలిసే జతగా

చరణం 1:

నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి
ఎలాగెలాగ?
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి
ఈ జంట కంటే వేరు లేదులేదంటి

నీమీద ఆశలు వుంచి ఆపైన కోటలు పెంచి
నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి

రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి

చరణం 2:

కొలిచె చెలిమే కలసి ఇటురా

నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడి పోనిపొమ్మంటి
ఎలాగెలాగ?
నాలోని మగసిరితోటి నీలోని సొగసులు పోటి
వేయించి నేనే ఓడి పోనిపొమ్మంటి

నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి

రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి
నీకంటి చూపులవెంట నా పరుగంటి
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి

2 comments:

  1. Madam... I believe new version song lyric is added here. Please replace it with old song lyric.
    Thanks, Ayyalasomayajula Mahesh, Vadodara, Gujarat India

    ReplyDelete
  2. ఇది కొత్త సినిమాలో కూడా ఉందండి కాస్త సాహిత్యం తేడాతో! పాత పాట కూడా ఈ బ్లాగ్ లో ఉందండి. ధన్యవాదాలు మహేష్ గారు!


    ReplyDelete