Saturday, July 27, 2013

గోలీమార్ గోలీమార్

చిత్రం: దొంగ (1985) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

గోలీమార్... గోలీమార్... గోలీమార్ మార్ మార్ 
మార్ మార్ ..మార్ మార్ .. 

కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె శృంగారమా 
వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

చరణం 1: 

పుట్టంగానే మట్టైపోయే కొత్త్తచట్టం వస్తే 
ముద్దుపెట్టాలంటే అల్లాడి పోతావే అమ్మడూ 
బాణామతి చేస్తారు ప్రాణాలింక తీస్తారు 
ఉన్న మతి పోయాక ..ఉప్పుపాతరేస్తారు 
ఓ... ఇంతి బంతి పూబంతి 
ఓ... శాంతి శాంతి ఓం శాంతి 
రుద్రం రౌద్రం రిరిమ్‌షా .. మూర్ఖం మూఢం ముముర్‌షా 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

చరణం 2: 

ముట్టంగానే నిప్పైపోయే కొరివి దెయ్యాలొస్తే 
కొంగులంటుకుంటే చల్లారేదెట్టాగో ఇప్పుడూ.... 
చేతబడి చేస్తారో కోడి మెడ కోస్తారో 
శ్మశానాల వీధుల్లో .. పిశాచాలు పడతారో 
ఓ... నారీ ప్యారీ వయ్యారి 
ఓ... భద్రా కాళి కంకాళి 
తీవ్రం తీండ్రం భిద్రుక్ష .. ముందు వెనుక పరీక్ష 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... 
కిల్లర్ కిల్లర్ కిల్లర్ కిల్లర్ ... 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 

కాష్మోర కౌగిలిస్తే ఏం చేస్తావో 
నేపాళీ మంత్రమేస్తే ఏమౌతావో 
కంగారు పడ్డ కన్నె శృంగారమా 
వణుకుల్లో కూడ ఇంత వయ్యారమా 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్ 
గోలీమార్ గోలీమార్ .. మార్ మార్ మార్ మార్

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9024

No comments:

Post a Comment