Thursday, July 25, 2013

మళ్లున్నా మాణ్యాలున్నా

చిత్రం: తోడు-నీడ (1965)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషుండాలి

చరణం 1:

పైరు మీది చల్లని గాలి...పైట చెరగును ఎగరేయాలి
పైరు మీది చల్లని గాలి ...పైట చెరగును ఎగరేయాలి
పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి
పక్కన ఉన్న పడుచువానికి...పరువం ఉరకలు వేయాలి

మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషుండాలి

చరణం 2:

ఏతమెక్కి గడవేస్తుంటే...ఎవరీ మొనగాడనుకోవాలి
...ఎవరీ మొనగాడనుకోవాలి

వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి
వంగి బానలు చేదుతు ఉంటే...వంపుసొంపులు చూడాలి

మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషుండాలి

చరణం 3:

కాలి దువ్వి కోవెల బసవడు...ఖంగుమని రంకేయాలి

దడవనులే మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను...
దడవనులే మావారున్నారు...వారి ఎదలో నేనుంటాను...

మళ్లున్నా మాణ్యాలున్నా...మంచె మీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా...పంచుకొనే మనిషుండాలి

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=582

No comments:

Post a Comment