చిత్రం: దాగుడుమూతలు (1964) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఘంటసాల పల్లవి: గోరొంకగూటికే చేరావు చిలకా గోరొంకగూటికే చేరావు చిలకా భయమెందుకే నీకు బంగారుమొలకా గోరొంకగూటికే చేరావు చిలకా చరణం 1: ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు అలసివుంటావు మనసు చెదరివుంటావు ఏ సీమదానవో ఎగిరెగిరి వొచ్చావు అలసివుంటావు మనసు చెదరివుంటావు మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే మా మల్లెపూలు నీకు మంచికథలు చెప్పునే ఆదమరిచి ఈ రేయి హాయిగా నిదురపో చరణం 2: నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి దాగని చిరునవ్వులు వద్దన్నాయీ... అబ్బ! ఉండన్నాయీ నిలవలేని కళ్ళు నిదరపొమ్మన్నాయి దాగని చిరునవ్వులు వద్దన్నాయీ... అబ్బ! ఉండన్నాయీ పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి పలుకైనా పలుకవా బంగారు చిలకా గోరొంకగూటికే చేరావు చిలకా భయమెందుకే నీకు బంగారుమొలకా గోరొంకగూటికే చేరావు చిలకా | |
Thursday, July 25, 2013
గోరొంకగూటికే చేరావు చిలకా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment