Monday, July 22, 2013

నడకలు చూస్తే మనసౌతుంది





చిత్రం: టక్కరి దొంగ చక్కని చుక్క (1969) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు 




పల్లవి: 

ఓ చక్కని చుక్కా...హే చక్కని చుక్కా 
నడకలు చూస్తే మనసౌతుంది 
కులుకులు చూస్తే మతిపోతుంది 
ఆహ.. ఓయబ్బో ఏమి సింగారం 
ఓయబ్బో.. లేత బంగారం 

చరణం 1: 

చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు 
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు 
చూడు.. ఇటు చూడు.. పగవాడు కాదు జతగాడు 
నవ్వు.. అర నవ్వు.. రతనాల పెదవిపై రువ్వు 
ఒక కంట మంటలను మెరిపించు 
ఒక కంట మంటలను మెరిపించు 
కాని.. ఒక కంట మల్లెలను కురిపించు 

ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... ఓయబ్బో.. ఏమి తలబిరుసు 
ఓయబ్బో.. ఏమి చెలిసొగసు... ఓయబ్బో.. ఏమి తలబిరుసు 

నీనడకలు చూస్తే మనసౌతుంది 
కులుకులు చూస్తే మతిపోతుంది 
ఆహ ఓయబ్బో ఏమి సింగారం 
ఓయబ్బో.. లేత బంగారం 

చరణం 2: 

ఊగి.. అటు సాగి.. ఒక నాగులాగ చెలరేగి 
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి 
ఊగి.. అటుసాగి.. ఒక నాగులాగ చెలరేగి 
విసిరి.. అటు కసిరి.. తనువెల్ల చీకటులు ముసిరి 
ఈ పూట నన్ను ద్వేషించేవు 
ఈ పూట నన్ను ద్వేషించేవు 
కాని.. ఆపైన నన్నె ప్రేమించేవు 

ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... ఓయబ్బో.. ఏమి ఆ మెరుపు 
ఓయబ్బో.. ఏమి ఆవిరుపు... ఓయబ్బో.. ఏమి ఆమెరుపు 

నీనడకలు చూస్తే మనసౌతుంది 
కులుకులు చూస్తే మతిపోతుంది 
ఆహ ఓయబ్బో ఏమి సింగారం 
ఓయబ్బో లేత బంగారం 
ఓయబ్బో ఏమి సింగారం 
ఓయబ్బో లేత బంగారం




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3011

No comments:

Post a Comment