Wednesday, July 24, 2013

హైసర బజ్జా పిల్లమ్మా

చిత్రం: తిక్క శంకరయ్య (1968)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

హైసర బజ్జా పిల్లమ్మా...అరెరే అరెరే బుల్లెమ్మా
హైసర బజ్జా పిల్లమ్మా...అరెరే అరెరే బుల్లెమ్మా
ఓ...ఓ...ఓ...ఓ..య్యా..

అద్దిరబన్నా ఓ రాజా...హయ్ రే...హయ్ రే నా రాజా...
అద్దిరబన్నా ఓ రాజా...హయ్ రే...హయ్ రే నా రాజా...
ఓ...ఓ...ఓ...ఓ...ఓ..య్యా..
గిరి గిరి గిరి పిట్టా.. తుర్రూ..

చరణం 1:

చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందింది
నారి చేతికందింది హాయ్..హాయ్...హాయ్...బుల్లెమ్మా
కులాస పాటల చలాకి తుమ్మెద గూటికి చేరింది
గులాబి గూటికి చేరింది...

నేనే నేనే తుమ్మెదను..నీకై మనసే తిమ్మెదను
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్యా..
అద్దిరిబన్నా ఓ రాజా..హయ్ రే...హయ్ రే.. నా రాజా
ఓ ..ఓ..ఓ....ఓ..య్యా..

చరణం 2:

వేగు చుక్క నేనైతే ...వెలగాపండు నీవైతే
కాళ్ళగజ్జా నేనైతే ...కంకాళమ్మ నీవైతే...హే...కంకాళమ్మ...
వేగు చుక్క నేనైతే ...వెలగాపండు నీవైతే...

కాళ్ళగజ్జా నేనైతే ...కంకాళమ్మ నీవైతే...
పిల్ల పేరు మల్లె మొగ్గ తానే అవుతుంది
నా పేరు జమిందారు... కాకేమౌతుంది
పిల్లా... కాకేమౌతుంది
ఓ...ఓ...ఓ...ఓ..య్యా..
హైసరబజ్జ పిల్లమ్మా...అరెరే అరెరే బుల్లెమ్మా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..య్యా

చరణం 3:

కిరు కిరు తలుపులు... కిరాయి తలుపులు
తలుపులు కావు... తొలి తొలి వలపులు...
అహోం ...అహోం... అహోం...
కిరు కిరు తలుపులు... కిరాయి తలుపులు
తలుపులు కావు... తొలి తొలి వలపులు

వలపంటే నా గుండెల్లో కలుక్కు కలుక్కు కలుక్కు
వలపంటే నా కళ్లలో తళుక్కు తళుక్కు తళుక్కు
కలుక్కు కలుక్కు కలుక్కు...తళుక్కు తళుక్కు తళుక్కు
హోయ్ కలుక్కు ..హోయ్ తళుక్కు
హోయ్ కలుక్కు..హోయ్ తళుక్కు..
కలుక్కు.. తళుక్కు..
కలుక్కు.. తళుక్కు..
భలే.. భలే.. భలే..య్యా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=657

No comments:

Post a Comment