Wednesday, July 24, 2013

ముద్దుల్ కావలెనా

చిత్రం: తేనెటీగ (1991) 
సంగీతం: విద్యాసాగర్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: రాజేంద్రప్రసాద్, ఎస్. పి. శైలజ

పల్లవి:

అబ్బా! స్టార్టయ్యిందిరా బాబూ.. కారు..
ఆఁ.. విప్పిందిరా బాబూ.. నోరు.. ఆఁహాఁ..
ఎక్కడికెళదాం?
ఏమో మీ ఇష్టం.. ఎక్కడపడితే అక్కడికెడదాం..
సినిమాకెళదామా?
ఊఁహూఁ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెంతో ఇష్టం..
ఊఁ.. బీచికెళదామా?
ఊఁహూఁ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెంతో ఇష్టం..
పోనీ.. హోటల్ కెళదామా..
ఊఁహూఁ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెంతో ఇష్టం..
ఇష్టం.. ఇష్టం.. అంటున్నావ్.. మరి ఎక్కడికీ రానంటున్నావ్..
పోనీ మీ ఇంటికి పోదాం?
అయ్యో నా పెళ్ళాముంది..
ఐతే మా ఇంటికి పోదాం?
ఏ.. మీ ఆయన లేడా?
ఆఁహాఁ..
మీ బ్రదరూ లేడా?
ఊఁహూఁ..
మీ లవరూ లేడా?
ఊఁహూఁ..
ఇంకెవరూ లేరా?
ఆఁహాఁ..

హుర్రే...

అయితే సరే మీ ఇంటికొచ్చైనా.. నీ చెయ్యి పట్టైనా.. కోరింది కొట్టైనా..
వెంట వస్తే.. ఇంటి కొస్తే.. లడ్డిస్తా.. లస్కిస్తా.. గంపకింద కోడిస్తా..
కోడి పెట్టిన గుడ్డిస్తా.. ఏం కావాలి..? ఇంకేం కావాలి..? నీకేం కావాలి..?

ముద్దుల్ కావలెనా.. మురిపాల్ కావలెనా
ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా.. మొత్తం కావలెనా బుజ్జి నాయనా..
మొత్తం కావలెనా బుజ్జి నాయనా..

ఆఁహుఁ.. ఆఁహుఁ..
ఆఁహుఁ.. ఆఁహుఁ..

ముద్దుల్ కావలెనే.. మురిపాల్ కావలెనే
ముద్దుల్ కావలెనే మురిపాల్ కావలెనే.. మొత్తం కావలెనే బుజ్జి అమ్మడు..
మొత్తం కావలెనే బుజ్జి

చరణం 1:

ఎడపెడా జడివాన.. ఆఁహూఁ..
కొరాకొరా కొడుతుంటే.. ఆఁహూఁ..
కసాబిసా చలిగాలీ.. చలో చలో మంటుంటే..

ఎడపెడా జడివాన.. ఆఁహూఁ..
కొరాకొరా కొడుతుంటే.. ఆఁహూఁ..
కసాబిసా చలిగాలీ.. చలో చలో మంటుంటే..

సల్లసల్లగా సీర జారిపోతోంది.. కొంగుపట్టుకో తస్సాదియా..
ఓరినాయనో ముల్లు గుచ్చుకున్నాది.. ఒడిసి పట్టుకో మామామియా..
వాటంగా తీస్తాను ముందు ముళ్ళూ..
ఆఁ.. తీశావా ఇస్తాను రేగుపళ్ళు
వాటంగా తీశావా ముందు ముళ్ళు.. ఇస్తాను రేగు పళ్ళు.. సల్లంగా అందుకో..
ఆఁహూఁ.. ఆఁహూఁ..
ఆఁహూఁ.. ఆఁహూఁ..

ముద్దుల్ కావలెనా.. మురిపాల్ కావలెనా
ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా.. మొత్తం కావలెనా బుజ్జి నాయనా..
మొత్తం కావలెనా బుజ్జి నాయనా..

చరణం 2:

చాపాదిండు సరిచేశా.. ఆఁహూఁ..
తెల్లా దుప్పటి పరిచేశా.. ఆఁహూఁ..
అదో ఇదో అందిస్తా.. అమితుమీ తేలుస్తా..ఆ..

చాపాదిండు సరిచేశా.. ఆఁహూఁ..
తెల్లా దుప్పటి పరిచేశా.. ఆఁహూఁ..
అదో ఇదో అందిస్తా.. అమితుమీ తేలుస్తా..

చాపాదిండు సరిచేశా.. ఆఁహూఁ..
తెల్లా దుప్పటి పరిచేశా.. ఆఁహూఁ..
అదో ఇదో అందిస్తా.. అమితుమీ తేలుస్తా..

ఓరినాయనో చెప్పాచెక్కల వేళ.. సోకు చూడరో తస్సాదియా
సద్దురేగితే అబ్బాయిల కళ్ళ గోల.. బ్రేకులెయ్యరో మామామియా..
వేగంగా రావేల సుందరాంగా.. ఎయ్.. వస్తాలే లాగిస్తా సుబ్బరంగా..
వేగంగా రావేల సుందరాంగా.. చూడాల సామిరంగా.. లాగించు తియ్యగా..ఆ..

ఆఁహూఁ.. ఆఁహూఁ..
ఆఁహూఁ.. ఆఁహూఁ..

ముద్దుల్ కావలెనా.. మురిపాల్ కావలెనా
ముద్దుల్ కావలెనా మురిపాల్ కావలెనా.. మొత్తం కావలెనా బుజ్జి నాయనా..
మొత్తం కావలెనా బుజ్జి నాయనా..

ముద్దుల్ కావలెనే.. మురిపాల్ కావలెనే
ముద్దుల్ కావలెనే మురిపాల్ కావలెనే.. మొత్తం కావలెనే..
హేహేహే.. మొత్తం కావలెనే బుజ్జి అమ్మడు..
మొత్తం కావలెనే బుజ్జి అమ్మడు..

ఆఁహూఁ.. ఆఁహూఁ..
ఆఁహూఁ.. ఆఁహూఁ..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11514

No comments:

Post a Comment