Saturday, July 27, 2013

అనురాగము విరిసేనా

చిత్రం: దొంగరాముడు (1955) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

ఆఅ ఆఅ ఆఆ........ 
అనురాగము విరిసేనా ఓ రే రాజా 
అనుతాపము తీరేనా 
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా 
అనురాగము విరిసేనా ఓ రే రాజా 
అనుతాపము తీరేనా 

చరణం 1: 

నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా 
నిలిచేవు మొయిలూ మాటునా పిలిచేవూ కనులా గీటునా 
పులకించు నాదు డెందము ఏ నాటి ప్రేమాబంధమో... 
ఓ రే రాజా...అనురాగము విరిసేనా 

చరణం 2: 

మునుసాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో 
మును సాగే మోహాలేమో వెనుకాడే సందేహాలేమో 
నీ మనసేమొ తేటగా తెనిగించవయ్య మహరాజా 
ఓ రే రాజా...అనురాగము విరిసేనా.. 
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా 
అనురాగము విరిసేనా....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1009

No comments:

Post a Comment