Tuesday, July 30, 2013

చిన్నారి బుల్లెమ్మా

చిత్రం: ధర్మదాత (1970) 
సంగీతం: టి. చలపతిరావు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

ఓ బుల్లెమ్మా..ఇగో..ఇగో.. 
చిన్నారి బుల్లెమ్మా...సిగ్గెందుకు లేవమ్మా 
చన్నీట స్నానాలు చాలమ్మా.. అమ్మా 
నీ చక్కిలిగింతలు నాకందించగ రావమ్మా 

చిన్నారి బుల్లెమ్మా...సిగ్గెందుకు లేవమ్మా 
చన్నీట స్నానాలు చాలమ్మా.. అమ్మా 
నీ చక్కిలిగింతలు నాకందించగ రావమ్మా... 

చరణం 1: 

మెరిసిన నీ కళ్ళలో ...ఆ రంగులు చూసి 
తడిసిన నీ మేనిలో... ఆ పొంగులు చూసి 

ఏం చూసి... 

రంగులు చూసి.... పొంగులు చూసి 
రంగుల పొంగుల... హంగులు చూసి 
మనసేమో అంటుందే.. మత్తెక్కి పోతుందే 
మనసేమో అంటుందే... మత్తెక్కి పోతుందే 
ఒళ్లంతా జిల్లంటుందే బుల్లెమ్మా 
బుల్లెమ్మ ..ఇగో..ఇగో.. 

చిన్నారి బుల్లెమ్మా...సిగ్గెందుకు లేవమ్మా 
చన్నీట స్నానాలు చాలమ్మా.. అమ్మా 
నీ చక్కిలిగింతలు నాకందించగ రావమ్మా... 

చరణం 2: 

చలి చలిగా ఉందటే... ఓ చక్కని దాన 
చీరలు కావాలటే... ఓ చిక్కని దాన 

యూ సిల్లీ.. 


చక్కనిదాన చిక్కనిదాన 
చక్కని చిక్కని చెక్కిలిదాన 
వేడుకలే తీరుస్తా ...మూడుముళ్ళు వేసేస్తా 
వేడుకలే తీరుస్తా ...మూడుముళ్ళు వేసేస్తా 
మోమాటం ఎందుకు లేవే ...బుల్లెమ్మా 
ఓ బుల్లెమ్మా ..ఇగో..ఇగో.. 

చిన్నారి బుల్లెమ్మా...సిగ్గెందుకు లేవమ్మా 
చన్నీట స్నానాలు చాలమ్మా.. అమ్మా 
నీ చక్కిలిగింతలు నాకందించగ రావమ్మా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1713

No comments:

Post a Comment