Tuesday, July 30, 2013

పరమేశ్వరి..జగదీశ్వరి

చిత్రం: ధర్మదాత (1970) 
సంగీతం: టి. చలపతిరావు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

ఓం పరమేశ్వరి..జగదీశ్వరి.. 
రాజేశ్వరి..కాళేశ్వరి...ఇకనైన శాంతించవే... 
మండోదరి..గుండోదరి...నీలాంబరి..కాదంబరి 
నీ దాసుని ...కరుణించవే 

చరణం 1: 

నీ దండకం నేను విన్నాను...నీ అండగా నేను ఉన్నాను 
నీ దండకం నేను విన్నాను...నీ అండగా నేను ఉన్నాను 
నీ హారతిని అందుకొన్నాను... 
నీ హారతిని అందుకొన్నాను...నీ ముద్దు చెల్లించనున్నాను 
నీ ముద్దు చెల్లించనున్నాను.... 

పరమేశ్వరి..జగదీశ్వరి.. 
రాజేశ్వరి..కాళేశ్వరి...ఇకనైన శాంతించవే... 
మండోదరి..గుండోదరి...నీలాంబరి..కాదంబరి 
నీ దాసుని ...కరుణించవే 

చరణం 2: 

ఎన్నెన్ని పుణ్యాలు చేసానో...ఈ జన్మలో నిన్ను చూసాను 
ఎన్నెన్ని పుణ్యాలు చేసానో...ఈ జన్మలో నిన్ను చూసాను 
చిలకమ్మ లెన్నెన్ని ఎదురైనా... 
చిలకమ్మ లెన్నెన్ని ఎదురైనా...తొలి చూపు నీపైనే వేసాను 
తొలి చూపు నీపైనే వేసాను.... 

పరమేశ్వరి..జగదీశ్వరి.. 
రాజేశ్వరి..కాళేశ్వరి...ఇకనైన శాంతించవే... 
మండోదరి..గుండోదరి...నీలాంబరి..కాదంబరి 
నీ దాసుని ...కరుణించవే 

చరణం 3: 

నా కళ్ళలో నిండి పోవాలి...నువ్వు నా గుండెలో ఉండి పోవాలి 
నా కళ్ళలో నిండి పోవాలి...నువ్వు నా గుండెలో ఉండి పోవాలి 
చెలి కౌగిలి చెరసాల కావాలి... 
చెలి కౌగిలి చెరసాల కావాలి...కలకాలం బంధీనై పోవాలి 

పరమేశ్వరి...ఊహు... 
ప్రాణేశ్వరి...ప్రణయేశ్వరి..హృదయేశ్వరి..మదనేశ్వరి.. 
ఇకనైన శాంతించవే.... 
రాజేశ్వరి..భాగేశ్వరి...రాగీశ్వరి..నాగేశ్వరి... 
నీ దాసుని ...కరుణించవే....

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1669

No comments:

Post a Comment