Wednesday, July 24, 2013

శివరంజని నవరాగిణి

చిత్రం: తూర్పు పడమర (1976)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: సినారె

నేపథ్య గానం: బాలు



పల్లవి :


శివరంజని నవరాగిణి

వినినంతనే నా తనువులోని

అణువణువు కరిగించే అమృతవాహిని

ఆ ఆ ఆ శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ



చరణం 1:



రాగాల సిగలోన సిరిమల్లివి... సంగీత గగనాన జాబిల్లివి 

రాగాల సిగలోన సిరిమల్లివి... సంగీత గగనాన జాబిల్లివి 



స్వర సుర ఝురీ తరంగానివి

స్వర సుర ఝురీ తరంగానివి

సరస హృదయ వీణా వాణివి

శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ



చరణం 2 :


ఆ కనులు పండు వెన్నెల గనులు... ఆ కురులు ఇంద్రనీలాల వనులు 

ఆ కనులు పండు వెన్నెల గనులు... ఆ కురులు ఇంద్రనీలాల వనులు


ఆ వదనం అరుణోదయ కమలం

ఆ అధరం సుమధుర మధుకలశం

శివరంజని నవరాగిణి ఆ ఆ ఆ ఆ



చరణం 3:


జనకుని కొలువున అల్లనసాగే జగన్మోహిని జానకి

వేణుధరుని రధమారోహించిన విధుషీమణి రుక్మిణి

రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా

లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా


రావే రావే నా శివరంజనీ మనోరంజనీ

రంజనీ…  నా రంజనీ

నీవే నీవే నాలో పలికే నాదానివీ

నీవే నా దానివీ

నాదానివి... నీవే నాదానివీ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8002

No comments:

Post a Comment