Tuesday, July 23, 2013

ఇది పాట కానే కాదు

చిత్రం: తలంబ్రాలు (1986)
సంగీతం: సత్యం
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా.. రోదన లయగా.. సాగే గానమిది
ఆ......ఆ....ఆ....ఆ....ఆ...
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

చరణం 1:

ఒంటరిగా తిరుగాడు లేడినొక మనిషి చూసినాడు..
చెంతకు చేరదీసినాడు
అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మిందీ..
తన హృదయం పరిచిందీ
ఆ తరువాతే తెలిసింది ఆ మనిషి పెద్ద పులనీ...
తను బలియై పోతిననీ

ఆ లేడి గుండె కోత.. నా గాధకు శ్రీకారం
నే పలికే ప్రతి మాటా స్త్రీ జాతికి సందేశం
ఆ...ఆ....ఆ....ఆ...ఆ...

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు

చరణం 2:

ఇప్పుడు కూడా నయవంచకులు ఇంద్రులు ఉన్నారు...
కామాంధులు ఉన్నారు
వారి చేతిలో వందలు వేలు బలి ఔతున్నారు...
అబలలు బలి ఔతున్నారు
నిప్పులు చెరిగే ఈ అమానుషం ఆగేదెప్పటికీ...
చల్లారేదెప్పటికీ

ఆ మంటలారుదాకా నా గానామాగిపోదు
ఆ రోజు వచ్చుదాకా నా గొంతు మూగపోదు

ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు
వేదన శృతిగా రోదన లయగా సాగే గానమిదీ
ఆ....ఆ....ఆ....ఆ...ఆ...
ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13103

No comments:

Post a Comment