Wednesday, July 31, 2013

కన్ను మిన్ను కానరాని

చిత్రం: నమ్మిన బంటు (1960)
సంగీతం: మాస్టర్ వేణు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

కన్ను మిన్ను కానరాని కాలితెరపు గిత్తరా..ఆ..
పట్టుకుంటే మాసిపోయే పాలపళ్ళ గిత్తరా..ఆ..ఆ..
అరెరెరెరెరెర్రే
ఒంటి మీద చేయి వేస్తే ఉలికిపడే గిత్తరా..ఆ..ఆ..

హేయ్.. పొగరుమోతు పోట్లగిత్తరా..
ఓరయ్య దీని చూపే సింగారమౌనురా
ఓరయ్య దీని రూపే బంగారమౌనురా

పొగరుమోతు పోట్లగిత్తరా..
ఓరయ్య దీని చూపే సింగారమౌనురా
ఓహ్-రయ్య దీని రూపే బంగారమౌనురా

చరణం 1:

ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది..
యెనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది
ఓహో..ఓ..ఓ.. హొయ్..
ముందుకొస్తే ఉరిమి కొమ్ములాడిస్తుంది..
యెనక్కొస్తే ఎగిరి కాలు ఝాడిస్తుంది
విసురుకుంటు కసురుకుంటు ఇటూ అటూ అటూ ఇటూ.. డుర్..ర్..ర్..ర్..ర్..
కుంకిళ్ళు పెడుతుంది కుప్పిగంతులేస్తుంది
పొగరుమోతు... హహ..

పొగరుమోతు పోట్లగిత్తరా..
ఓరయ్య దీని చూపే సింగారమౌనురా
ఓహ్-రయ్య దీని రూపే బంగారమౌనురా

చరణం 2:

అదిలిస్తే అంకెవేయు..
బెదురుమోతు గిత్తరా..ఆ..ఆ..ఆ..
అరెరెరెరెరే
కదిలిస్తే గంతులేసి కాండ్రుమనే గిత్తరా..ఆ..ఆ..ఆ..
దీని నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడకజోరు చూస్తుంటే వడలు పులకరిస్తుంది
అహ.. నడుముతీరు చూస్తుంటే నవ్వు పుట్టుకొస్తోంది
నడకజోరు చూస్తుంటే వడలు పులకరిస్తుంది
వన్నెచిన్నెల రాణి.. ఇవ్వాళ మంచి బోణి
డుర్..ర్..ర్..ర్..ర్.... వన్నెచిన్నెల రాణి..
ఇవ్వాళ మంచి బోణి
నిన్నొదిలిపెడితే ఒట్టు.. ఈ వగలు కట్టిపెట్టు
పొగరుమోతు... హహ..

పొగరుమోతు పోట్లగిత్తరా..
ఓరయ్య దీని చూపే సింగారమౌనురా
ఓహ్-రయ్య దీని రూపే బంగారమౌనురా..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1079

No comments:

Post a Comment