Tuesday, July 23, 2013

రానేల వసంతాలే








చిత్రం: డాన్స్ మాస్టర్ (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం: చిత్ర



పల్లవి :

రానేల వసంతాలే.. శృతి కానేల సరాగాలే
నీవేనా జీవనరాగం.. స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం.. స్మరించే గీతం

రానేల వసంతాలే..

చరణం 1 :

ఈ మౌన పంజరాన.. నే మూగనై
నీ వేణువూదగానే నీ రాగమై
ఎగిరే శోకమై విరిసే తోటనై
ఏ పాట పాడిన పది పూవులై
అవి నేల రాలిన చిరుతావినై
బదులైనలేని ఆశలారబోసి

రానేల వసంతాలే..

చరణం 2 :

ఓ ప్రేమికా చెలియా.. ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే దరిజేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపుతోనే చలి తీరగా
నీ స్పర్శతోనే మది పాడగా
ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల వసంతాలే.. శృతి కానేల సరాగాలే
నీవేనా జీవనరాగం.. స్వరాల బంధం
నీదేనా యవ్వన కావ్యం.. స్మరించే గీతం

రానేల వసంతాలే.. శృతి కానేల సరాగాలే




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5641

No comments:

Post a Comment