Thursday, August 1, 2013

చామంతి ఏమిటే ఈ వింత

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత
ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది

చరణం 1:

ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే
ఇన్నాళ్ళూ ఈ వలపే ఏమాయే
నీ కన్నుల్లో ఈ మెరుపే కరువాయే

ఇన్నాళ్ళూ నీ హొయలు చూసాను
నా ఎదలోనే పదిలంగా దాచాను వేచాను ...

ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత ...

చరణం 2:

దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా ...
దూరాల గగనాల నీమేడ
ఓ దొరసాని నను కోరి దిగినావా....

నీ మనసే పానుపుగా తలచేను
నీ ప్రాణంలో ప్రాణంగా నిలిచేను వలచేను....

ఓ...చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది
ఈ చిలకమ్మకు నాకు వరస కుదిరింది వలపు పెరిగింది...
ఓ... చామంతి ఏమిటే ఈ వింత
ఈ చినవానికి కలిగేనేల గిలిగింత లేని పులకింత


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1659

No comments:

Post a Comment