Sunday, August 11, 2013

విధి వంచితులై


చిత్రం:  పాండవ వనవాసం (1965)
సంగీతం:  ఘంటసాల
గీతరచయిత:  సముద్రాల (సినియర్)
నేపధ్య గానం:  ఘంటసాల


పల్లవి: 

న్యాయానికే.. పరాజయమా..
వంచనకే ధర్మము తలవంచేనా

ఆ.. ఆ.. ఆ.. ఆ..

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా
విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో.....అడవి పాలయేరా

చరణం::1

నీ మది రగిలే కోపానలము
ఈ మహినంతా దహియించేనని
మోమును దాచేవ ధర్మరాజా

అయ్యో....అడవి పాలయేరా

చరణం : 2

సభలో చేసిన శపథముదీరా
పావుల నదిలో త్రుంచెదనేనని
బాహువులూచేవా భీమసేనా..

ఆహా…అడవి పాలయేరా

చరణం : 3

ఆలములోన కౌరవసేన
అమ్ములవానా ముంచెదనేనని
ఇసుమును చల్లేవ సవ్యసాచి

విధి వంచితులై విభవము వీడి
అన్నమాట కోసం అయ్యో....అడవి పాలయేరా

చరణం : 4 

ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
ఏ యుగమందూ ఏ ఇల్లాలు
ఎరుగదు తల్లీ ఈ అవమానం
నీ పతి సేవయె నీకు రక్ష  

No comments:

Post a Comment