Monday, August 5, 2013

మానస వీణా మధుగీతం


చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:

    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
    మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
    సాగర మధనం..అమృత మధురం
    సంగమ..సరిగమ..నవపారిజాతం
    మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
    సంసారం...సంగీతం...

చరణం 1:

    ఏ రాగమో ఏమో మన అనురాగం
    వలపు వసంతాన హృదయపరాగం
    ఆ ఆ..అ అ ఆ..అ అ అ ఆ..ఆ ఆ
    అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
    ఏ రాగమో ఏమో మన అనురాగం
    వలపు వసంతాన హృదయపరాగం
    ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం
    శతవసంతాల...దశదిశంతాల సుమసుగంధాల...భ్రమరనాదాల
    కుసుమించు నీ అందమే..విరిసింది అరవిందమై కురిసింది మకరందమై..

చరణం 2:

    జాబిలి కన్నా నా చెలి మిన్నా..పులకింతలకే పూచిన పొన్న..
    కానుకలేమి నే నివ్వగలను? కన్నుల కాటుక నే నవ్వగలను !
    పాలకడలిలా వెన్నెల పొంగింది పూలపడవలా నా తనువూగింది
    ఏ మల్లెల తీరాల నిను చేరగలనూ ? మనసున మమతై కడతేరగలను !
    ఆ...గగసరి గపదప మమ గగ రిరి సస సరిసగమ
    రిమగపదప రిమరిమ స రి..గస స..పద ద..పద ద ప..
    మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం సంసారం...సంగీతం...

చరణం 3:

    ఆ..ఆఆ...ఆ..ఆ..నిరిగమద మగరిని..దనిని..నిదమ..ఆ ఆ ఆ...ఆ ఆ అ ..
    నిని రిరి గగ మమ దద
    దద నిని రిరి గగ మమ
    మమ దద నిని రిరి గగగ
    కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమని
    ఆ ఆ అ..తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని
    ఆ ఆ..కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ
    సనిరి సని..ని ని ని..నిని నిని నిని దని దనిద మద సస స
    మగదమగ మగ మగ గద మగ మగ..నిమగమ దప..దగరిగ రిగ..దనినిరి నిరి
    ఆ ఆ అ అ...ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ ఆ......ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ..మా...రిమగదప రిమరి..సరిమరి సరిసద..ససరి సరిమ..పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని
    మానస వీణా మధుగీతం మనసంసారం సంగీతం
    సాగర మధనం..అమృత మధురం
    సంగమ..సరిగమ..నవపారిజాతం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5516

No comments:

Post a Comment