Wednesday, August 7, 2013

చూసిన చూపే చూడనీ పదే పదే


చిత్రం: పసి హృదయాలు (1973)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

    చూసిన చూపే చూడనీ పదే పదే
    దోచిన రూపే దోచనీ పదే పదే
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే
    చూసిన చూపే చూడనీ పదే పదే

చరణం 1:

    నా మనసే ఎగిసినదీ...నీ మీదే అది వాలినదీ
    నా మనసే ఎగిసినదీ...నీ మీదే అది వాలినదీ
    నా చేయి నీ చేయి...పెనవేస్తూ పోతుంటే
    నీ పెదవి నా పెదవి ...ప్రతినిమిషం తోడుంటే
    తేనే వెన్నెలా ...కలయిక అదే అదే
    తేనే వెన్నెలా... కలయిక అదే అదే
    అదే అదే ...హానీమూన్

    చూసిన చూపే చూడని పదే పదే
    దోచిన రూపే దోచనీ పదే పదే
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే
    చూసిన చూపే చూడనీ పదే పదే

చరణం 2:

    కౌగిలిలో కలిశామూ...కమ్మదనంలో కరిగామూ
    ఊ..కౌగిలిలో కలిశామూ...కమ్మదనంలో కరిగామూ
    చెలరేగే పరువాలే ...కెరటాలై డీకొంటే
    ప్రతి తరగా ప్రతి నురగా...మన కథలే చెపుతుంటే
    వలపుల కడలికే ...వంతెన కడదాము
    వలపుల కడలికే ...వంతెన కడదాము
    అదే అదే హానీమూన్...

    చూసిన చూపే చూడని పదే పదే
    దొచిన రూపే దోచనీ పదే పదే
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    మెరిసే పగలైనా.. ఉరిమే రేయైనా
    వలచే జంటలకూ సహజం ఇదే ఇదే

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3576

No comments:

Post a Comment