Tuesday, August 6, 2013

సిరిమల్లె నీవే


చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు


పల్లవి :

సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే విరిజల్లు కావే


చరణం 1:

ఎలదేటిపాటా చెలరేగె నాలో .... చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎలమావి తోటా పలికింది నాలో...  పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే...  నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే వనదేవతల్లే... పున్నాగపూలే సన్నాయి పాడే


  ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే.... సిరిమల్లె నీవే విరిజల్లు కావే



చరణం 2:

మరుమల్లె తోటా మారాకు వేసే...  మారాకు వేసే నీ రాకతోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వేళా...  బ్రతికించుకోవే నీ పదముగానే


నా పదము నీవే...  నా బ్రతుకు నీవే
 అనురాగమల్లే సుమగీతమల్లే
 నన్నల్లుకోవే నా ఇల్లు నీవే...  


ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే.... సిరిమల్లె నీవే విరిజల్లు కావే

హా... హా... హా... ల... ల... 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5518

1 comment:

  1. మంచి పాట అందించారు. బాలూగారి పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటండి ఇది.

    ReplyDelete