Tuesday, August 6, 2013

ఒసే వయ్యారి రంగి


చిత్రం: పల్లెటూరి బావ (1973)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

    ఒసే వయ్యారి రంగి...వగలమారి బుంగి
    ఊగిందే నీ నడుము ఉయ్యాలా... ఆ ఊపు చూస్తుంటే...
    నేనోపలేకుంటే.. పాడిందే నా మనసు జంపాలా...

    ఒసే వయ్యారి రంగి...వగలమారి బుంగి
    ఊగిందే నీ నడుము ఉయ్యాలా... ఆ ఊపు చూస్తుంటే...
    నేనోపలేకుంటే.. పాడిందే నా మనసు జంపాలా..

చరణం 1:

    నీ చూపులో ఉందే పిడిబాకు...దాని పదునెంతో చూస్తానే
    నీ చెంపలో ఉందే చిగురాకు...దాని వగరెంతో చెపుతానే
    ఈ ఏళ కాదని అనమాకు....
    ఈ ఏళ కాదని అనమాకు...ఇంకెన్నాళ్లే ఈ కులుకూ..
    నా రవ్వా...నా గువ్వా..నా మువ్వా..ఓ రంగమ్మా
    జివ జివ లాడిందే... మనసే...గుబ గుబ లాడిందే

    ఒసే వయ్యారి రంగి...వగలమారి బుంగి
    ఊగిందే నీ నడుము ఉయ్యాలా... ఆ ఊపు చూస్తుంటే...
    నేనోపలేకుంటే.. పాడిందే నా మనసు జంపాలా..

చరణం 2:

    ఎగిరెగిరి పడుతుందే నీ పైటా...ఓహో..ఈ పాటి చిరుగాలికే
    ఉరికురికి వస్తుందే నీ వయసు...అహ.. నాతోటి జగడానికే
    అదిరదిరి పడుతుందే ...నీ మనసు...
    అదిరదిరి పడుతుందే నీ మనసు...ఉత్తుత్తి సరసాలకే...
    నా కన్నా..నా చిన్నా..నా పొన్నా..ఓ రంగమ్మా..
    జివ జివ లాడిందే.. మనసే గుబ గుబ లాడిందే

    ఒసే వయ్యారి రంగి...వగలమారి బుంగి
    ఊగిందే నీ నడుము ఉయ్యాలా... ఆ ఊపు చూస్తుంటే...
    నేనోపలేకుంటే.. పాడిందే నా మనసు జంపాలా..

చరణం 3:

    కోటప్ప తిరణాళ్ళకెళ్ళినప్పుడు...మనం కొన్నామే గుళ్ళపేరూ
    అది రొమ్ము మీద అటు ఇటు దొర్లుతుంటే...నాకు రిమ్మ తెగులు రేగుతుందే
    పెళ్ళైన వాణ్ణని జంకమాకు...
    పెళ్ళైన వాణ్ణని జంక మాకు...ఒకరికి ఇద్దరైన వేడుకేలే
    నా చిట్టీ.. నా పొట్టి..నా పట్టి..
    ఓ రంగమ్మా... వేస్తానే మూడు ముళ్ళు..
    రంగమ్మా ...వేస్తానే మూడు ముళ్ళు
    పిపి..పిప్పిపీ..డుం.. డుం
    పిపి.. పిప్పీ.. డుం.. డుం.. డుం..
    పిప్పిపీ డుం ..డుం ..డుం..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1256

No comments:

Post a Comment