చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: కోదండపాణి, సుశీల
పల్లవి :
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు ...బంధాలేమో పదివేలు...
చరణం: 1
నదిలో నావ ఈ బ్రతుకు... దైవం నడుపును తన బసకు
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నదిలో నావ ఈ బ్రతుకు.... దైవం నడుపును తన బసకు
అనుబంధాలు ఆనందాలు... తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు....
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
చరణం: 2
రాగం ద్వేషం రంగులురా... భోగం భాగ్యం తళుకేరా
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రాగం ద్వేషం రంగులురా... భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం... నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా....
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ....
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు....
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3012
No comments:
Post a Comment