Monday, August 5, 2013

మనసెరిగినవాడు మా దేవుడూ


చిత్రం: పంతులమ్మ (1977)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: సుశీల


పల్లవి:

    మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ
    మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు...
    మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ


చరణం 1 :

    ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
    ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
    మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ....

    తలచిన వారికి తారకనాముడు
    పిలిచిన పలికే చెలికాడు సైదోడు
    కొలువై ఉన్నాడు కోదండరాముడు
    మన తోడుగా .. నీడగా .. రఘురాముడు...

    మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ

చరణం 2:


 కరకు బోయను ఆది కవిని చేసిన పేరు
  గరళకంఠుని నోట తరలి వచ్చిన పేరు
  ఇహపర సాధనకు ఇరువైన పేరు....


    శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
    హనుమ ఎదలో భక్తి ఇనుమడించిన పేరు
    రామ రామ అంటే కామితమే తీరు
    కలకాలము మమ్ము కాపాడు పేరు.... 
    మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ..
    మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు...

    మనసెరిగినవాడు మా దేవుడూ... శ్రీరాముడూ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8349

No comments:

Post a Comment