Wednesday, August 7, 2013

అందం శరణం గఛ్చామి


చిత్రం: పసివాడి ప్రాణం (1987)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి:


అందం శరణం గఛ్చామి...  అధరం శరణం గఛ్చామి
ఈ సాయంత్ర వేళ...  నీ ఏకాంతసేవ
అతి మధురం... అనురాగం.. ఒదిగే వయ్యారం

ప్రణయం శరణం గఛ్చామి.... హృదయం శరణం గఛ్చామి
ఈ సింధూర వేళ... నీ శృంగారలీల
సుఖ శిఖరం... శుభయోగం.... అది నా సంగీతం


చరణం 1:

ఎంతకు తీరని ఎదలో ఆశలేమో... 
అడగరానిదై చెప్పరానిదై.. పెదవుల అంటింతనై... 

మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై.. చినుకు తేనెకై ... కసికసి కవ్వింతలై

నీ నవ్వు నాలో... నాట్యాలు చేసే
కౌగిట్లో.. సోకమ్మ వాకిట్లో... తెరిచే గుప్పిళ్లలోన...

ప్రణయం శరణం గఛ్చామి.... హృదయం శరణం గఛ్చామి

    


చరణం 2:


చూపుతో గిచ్చక..  వయసే లేతదమ్మా...
వలపు గాలికే వాడుతున్నది.. విసరకు పూబాణమే 

చేసుకో మచ్చిక ... వరసే కొత్తదమ్మా
చలికి రేగిన ఒడికి చేరిన.. చెరిసగ మీ ప్రాణమే


నీ ఊపిరి నాలో పూలారబోసి... 

అందాలో నా ప్రేమ గంధాలో...  ముసిరే ముంగిళ్లలోన


అందం శరణం గఛ్చామి... హృదయం శరణం గఛ్చామి
ఈ సాయంత్ర వేళ ... నీ ఏకాంతసేవ
సుఖ శిఖరం శుభయోగం... అది నా సంగీతం


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9403

No comments:

Post a Comment