Monday, August 5, 2013

మనసే జతగా పాడిందిలే


చిత్రం: నోము (1974)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి :

మనసే జతగా పాడిందిలే... తనువే లతలా ఆడిందిలే
మనసే జతగా పాడిందిలే... తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఆ ఆ

మనసే జతగా పాడిందిలే... తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. ఓ...

చరణం:1


ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ
హే హే.. ఈ గిలిగింతా సరికొత్త వింతా ఏమన్నదీ
పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నదీ

ఓ అందుకే ఓ చెలీ..అందుకో కౌగిలీ..ఓ చెలీ..హే..హే..

మనసే జతగా పాడిందిలే.. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

చరణం:2

నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ
ఓహో.. నింగిన సాగే నీలాల మేఘం ఏమన్నదీ
నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నదీ

ఓ అందుకే ఓ ప్రియా..అందుకో పయ్యెదా.. ఓ ప్రియా...

హే హే.. మనసే జతగా పాడిందిలే.. తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో..

ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... తనువే లతలా ఆడిందిలే
ఈ వేళలో ఎందుకో.. 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4605

No comments:

Post a Comment