Saturday, August 3, 2013

పూలై పూచే రాలిన తారలే

చిత్రం: నిండు మనిషి (1978) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

పూలై పూచే...రాలిన తారలే.. 
అలలై వీచే... ఆరని ఆశలే.. 
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు నీ గీతమై 

పూలై పూచే...రాలిన తారలే.. 
అలలై వీచే... ఆరని ఆశలే.. 
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు నీ గీతమై 

పూలై పూచే...రాలిన తారలే.. 
అలలై వీచే... ఆరని ఆశలే.. 
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు నీ గీతమై 

చరణం 1: 

కాంతులు విరిసే నీ కన్నులలోనా... హా.. 
నా కలలుండాలి... ఏ జన్మకైనా 
మమతలు నిండిన నీ కౌగిలిలోనా... హా 
నా మనువు తనువు పండించుకోనా 

నా వలపే నిండని.. పండని.. నీ రూపమై 
నా వలపే నిండని.. పండని.. నీ రూపమై 

పూలై పూచే...రాలిన తారలే.. 
అలలై వీచే... ఆరని ఆశలే.. 
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై 
నీలో పలికేను ఏనాడు నీ గీతమై 

చరణం 2: 

మెరిసెను నవ్వులు నీ పెదవుల పైనా.. హా... 
అవి వెలిగించాలి యే చీకటినైనా.. 
వెచ్చగ తాకే నీ ఊపిరిలోనా... హా... 
జీవించాలి నా బాసలు ఏనాడైనా... 

నా బ్రతుకే సాగని... ఆగని.. నీ ధ్యానమై 
నా బ్రతుకే సాగని... ఆగని.. నీ ధ్యానమై 

పూలై పూచే...రాలిన తారలే.. 
అలలై వీచే... ఆరని ఆశలే.. 
నీలో నిలిచేను ఏనాడు నీ ప్రాణమై.. 
నీలో పలికేను ఏనాడు నీ గీతమై

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2043

No comments:

Post a Comment