Friday, September 27, 2013

చలెక్కి ఉందనుకో

చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర


పల్లవి:

చలెక్కి ఉందనుకో..ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....

చరణం 1:

చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా..
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా...
చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా..
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా..

నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం..
వెలుగివ్వననీ ముసుగేసుకొనీ మసిబారదు ఏ దీపం..

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....

చరణం 2:

కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన..
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా...
కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన..
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా...

కలలన్నిటినీ పిలిపించుకొని నిలవేసి
నా కళ్ళనీ..
నెమరేసుకోని వెళ్ళీపోకుమరీ విలువైన విలాసాన్నీ...

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....
చలెక్కి ఉందనుకో...ఏ....

No comments:

Post a Comment