Tuesday, October 29, 2013

ఇది చల్లని వేళైనా

చిత్రం : పూజాఫలం (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : సుశీల

పల్లవి :

నేరుతునో లేదో ప్రభూ... నీ పాటలు పాడా...

ఇది చల్లని వేళైనా... ఇది వెన్నెల రేయైనా
నిదుర రాదు కనులకు... శాంతి లేదు మనసుకు
మదిలో వేదన ఏదో... కదలే రాధకు
ఇది చల్లని వేళైనా...


చరణం 1:


నీ దయలాగున వెన్నెల...జగమంతా ముంచే
నీ మధుర ప్రేమా..యమున కడలంతా నించే
మరి మరి ముల్లోకములను...మురిపించే స్వామీ
మనసు చల్లబడ...కనిపించవేమీ

ఇది చల్లని వేళైనా

చరణం 2 :

నీ వేణువు కోసం...బ్రతుకంతా వీనులాయే
నీ దర్శనమునకై...ఒడలంతా కనులాయే
బడలే బ్రతుకున ఆశలు...వెలిగించే దేవా
కదలే వీణియ తీగలు...సవరించి పోవా

ఇది చల్లని వేళైనా...ఇది వెన్నెల రేయైనా

No comments:

Post a Comment