Monday, November 11, 2013

పప్పు దప్పళం

చిత్రం :  పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, వసంత

పల్లవి:

ప ప ప ప ప ప ప పప్పు దప్పళం
ప ప ప ప ప ప ప పప్పు దప్పళం
అన్నం ..నెయ్యి వేడి అన్నం.. కాచినెయ్యి
వేడీ వేడీ అన్నం మీద... కమ్మని పప్పు కాచినెయ్యి
వేడీ వేడీ అన్నం మీద కమ్మని పప్పు కాచినెయ్యి
పప్పూ దప్పళం కలిపి కొట్టడం
భోజనం వన భోజనం
వన భోజనం జన రంజనం

చరణం 1:

తల్లితోడు పిల్లామేకా
ల ల ల ల...
తల్లితోడు పిల్లామేకా ఆలూమగలు అత్తాకోడలు బాసూబంటూ ఒకటేనంటూ కలవడం
భోజనం వన భోజనం
భోజనం .... వన భోజనం

మన వయసుకి నచ్చినట్టి ఆటలూ
మన మనసుకు వచ్చినట్టి పాటలూ

మన వయసుకి నచ్చినట్టి ఆటలూ
మన మనసుకు వచ్చినట్టి పాటలూ
ప స ని స ప ని ద ని మ ద ప ద మ ప
స గ మ మ ద మ మ గ రి పాడితే
రంజనం జన రంజనం
రంజనం జన రంజనం

మీరు సా సా సా
మీరు రీ రీ రీ
తమరు గా గా గా
మేము పా పా పపా
మేము దా దా దదా
నీ నీ నినీ
మరల సా
వేరీ గుడ్ బావుంది బావుంది బావుంది
ఇప్పుడు నేనెవర్ని చూపిస్తే వాళ్ళు ఆ స్వరం పాడాలి ఏం

చరణం 2:

సరిగా సారిగా మా మా మా మా
రిగామా రీగమా పాపా పా పా
తదిగిడత తక్కధిమి తదిగిడత తక్కధిమి

మసాలా గారెలూ మా మా
జిలేబీ బాదుషా పా.. పా
సమోసా తీసుకో దా.. దా
పోటాటో చిప్స్ తోనా.. నీ
మిఠాయి ఖావొరే.. ద
పకోడీ తిందువా పా.. పా
మలాయి పెరుగిది మా.. మా
టోమాటో చట్నితో గా.. గా
పసందు పూర్ణమూ బూ.. రీ
నంజుకో కారప్పూసా...సా.. ఆ...

చరణం 3:

అరిశెలు బూరెలు వడలూ ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలూ కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు

అరిశెలు బూరెలు వడలూ ఆవడ బోండలు కజ్జికాయలు
కరకరలాడు జంతికలూ కమ్మని ఘుమ్మని నేతి చిప్సులు

కరమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులూ

 ష్...

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ...

కరమగు నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి
త్వర త్వర సర్వ్ చేయవలె తైతక్కలాడగ పిక్కునిక్కులు
తైతక తైతక తైతక తైతక తై తై తై తై

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11520
 

No comments:

Post a Comment