Sunday, November 10, 2013

అహో..అందాల రాశి

చిత్రం : అంగడి బొమ్మ (1978) 
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 
నేపథ్య గానం : బాలు



పల్లవి :



అహో..అందాల రాశి..
ఓహో....అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..

అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..



చరణం : 1



నీ అంగ అంగం.. మన్మథుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..
నీ అంగ అంగం.. మన్మథుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..


నీ పైని మోహం.. తుదిలేని దాహం..
నువ్వు రేపు తాపం.. వరమైన శాపం..
నీకే శిల్పి ఇచ్చాడో.. ఈ దివ్య  రూపం



అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..



చరణం   2 : 



నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం...  సంగీత శాస్త్రం..
నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం... సంగీత శాస్త్రం..




దివిలోని వాడు.. నిన్నంపినాడు..
భువిలోని వాడు.. చవి చూచినాడు..
అతడానాడే ఐనాడు నీ  దాసుడు



అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8009

  

No comments:

Post a Comment