Thursday, November 14, 2013

యాతమేసి తోడినా

చిత్రం : ప్రాణం ఖరీదు (1978)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  జాలాది

నేపధ్య గానం :  బాలు



పల్లవి :


యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 

యాతమేసి తోడినా యేరు ఎండదు

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 



దేవుడి గుడిలోదైనా... పూరి గుడెసలోదైనా

గాలి ఇసిరికొడితే...ఏ...ఏ...ఏ...

ఆ దీపముండదూ..ఊ...ఊ... ఆ దీపముండదూ...



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు 



చరణం 1 :




పలుపు తాడు మెడకేత్తే పాడి ఆవురా...ఆ...

పసుపు తాడు ముడులేత్తే ఆడదాయెరా...ఆ...



కుడితి నీళ్లు పోసినా...ఆ..ఆ...ఆ

అది పాలు కుడుపుతాదీ...ఈ...ఈ...ఈ ఈ...ఈ

కడుపుకోతకోసినా...ఆ...ఆ.. ఆ...ఆ...

అది మనిషికే జన్మ ఇత్తాదీ... ఈ...



బొడ్డు పేగు తెగిపడ్డా  రోజు తలుసుకో..

గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో... 



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు





చరణం 2 :




అందరూ నడసొచ్చిన తోవ ఒక్కటే...
సీమునెత్తురులు పారే తూము ఒక్కటే... 


మేడ మిద్దెలో ఉన్నా...ఆ..ఆ...ఆ ఆ...ఆ
సెట్టునీడ తొంగున్నా..ఆ....ఆ...ఆ
నిదర ముదరపడినాకా..ఆ..ఆ..ఆ..
పాడె ఒక్కటే... హ హ.. వల్లకాడు ఒక్కటే..


కూతునేర్చినోల్ల కులం కోకిలంటరా..హ..హ
ఆకలేసి అరసినోళ్లు కాకులంటరా..   



యాతమేసి తోడినా యేరు ఎండదు 

పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4838

4 comments:

  1. సరి చూడ గలరు.
    చరణం 1: గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో...
    చరణం 2: పాడె ఒక్కటే.. హ హ.. వల్లకాడు ఒక్కటే...

    ReplyDelete
  2. పల్లవిలో గాలి ఇసిరి కొడితే... కాలి కాదు..

    ReplyDelete