Saturday, November 9, 2013

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ

చిత్రం :  పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల, బాలు

పల్లవి:

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్
అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

చరణం 1:

ఓ...
అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావో
ఆ...
చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావో
ఎందా??
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వీదువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జెడ బా...రెడూ
మనసిలాయో...

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

చరణం 2:

హా హా హా...
ఆ...
 లా లా లా...
హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి..
అదేంటి...
ఓ...
గుటకలు చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసూ
గుటకలు.. చిటికెలు.. కిటుకులు.. ఏమిటి సంగతి??
ఆ..కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులూ
మనసిలాయో...

కిట్టమూర్తీ కిట్టమూర్తీ మనసిలాయో
మనసిలాయో మనసిలాయో ... అమ్ముకుట్టి

చరణం 3:

తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
తత్తోం తగ తయ్యత్తోం సారిగ సారిరిస సారి
గసరిదమ పాదపమగరి నిగమప దపమగ పమగరి గరిసని
ఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే
తిరుఓణం వన్నే ఓణం వన్నే ఓణం వన్నే

గుండెల్లోన గుబగుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళూ
పరవశమైనా మా శ్రీవారికి పగ్గాల్లేనీ పరవళ్ళూ
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...
చుట్టూ చూస్తే అందాలూ... లొట్టలు వేస్తూ మావారూ...

అక్కడ తమకూ ఇక్కడ మనకూ విరహంలోనా వెక్కిళ్ళు
మనసిలాయో...

అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

అమ్ముకుట్టీ.. అమ్ముకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో
కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11518

No comments:

Post a Comment