Monday, December 9, 2013

ఈ రోజు మంచి రోజు




చిత్రం : ప్రేమలేఖలు (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : శ్రీశ్రీ
నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం


పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ ....
ఈ రోజు... మంచి రోజు.. 
మరపురానిది.. మధురమైనది
మంచితనం ఉదయించినరోజు

ఆ ఆ ఆ ఆ...
ఈ రోజు.. మంచి రోజు... 
మరపురానిది.. మధురమైనది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 1:

తొలిసారి ధృవతార దీపించెను... ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
ఆ ఆ ఆ ఆ.. 
తొలి ప్రేమ హృదయాన పులకించెను... అది ఆనంద దీపాలు వెలిగించెను

చెలికాంతులలో.. సుఖశాంతులతో.. జీవనమే పావనమీనాడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
ప్రేమ సుమం వికసించినరోజు

చరణం 2:

రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్ని ఒకటైతే మానవత్వము

మనసు మనసు లొకరికొకరు తెలిపే రోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు..అభినందనలు
అందించే శుభసమయం నేడు

ఈ రోజు మంచి రోజు... మధురమైనది మరపురానిది
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు
మంచితనం ఉదయించినరోజు... ప్రేమ సుమం వికసించినరోజు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5314

No comments:

Post a Comment