Saturday, September 28, 2013

ఎవరివో.. నీవెవరివో

చిత్రం : పునర్జన్మ (1963)
సంగీతం :  టి . చలపతిరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల 

పల్లవి:

ఓ..ఓ..ఓ..ఓ.. సజీవ శిల్ప సుందరి..
నా..ఆ.. జీవన రాగమంజరి..ఈ..ఈ..ఈ..
ఎవరివో.. ఎవరివో..
ఎవరివో.. నీవెవరివో
ఎవరివో.. ఎవరివో..
నా భావనలో.. నా సాధనలో
నా భావనలో నా సాధనలో.. నాట్యము చేసే రాణివో
ఎవరివో.. నీవెవరివో..

చరణం :1 

దివినే వదలి భువికేదెంచిన.. తేనెల వెన్నెల సోనవో
కవితావేశమే కలలై అలలై.. కురిసిన.. పువ్వుల.. వానవో..ఓ..

ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..

చరణం : 2

నవ వసంతమున నందనవనమున..ఆ..ఆ..ఆ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో..ఓ..
నవ వసంతమున నందనవనమున.. కోయిల పాడిన పాటవో
వలపు కొలనులో కలకల విరిసిన.. కలువుల.. కన్నుల.. కాంతివో
ఎవరివో.. నీవెవరివో..
ఎవరివో.. ఎవరివో..

చరణం : 3

నీ కర కంకణ నిక్వణమాది వాణీ వీణా నినాదమా
నీ పద నూపుర నిశ్వనమాది జలధి తరంగ మృదంగ రావమా
రావే మోహన రూపమా..
రావే నూతన తేజమా..
రావే..ఏ.. రావే..  

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1056

మనసు పాడింది సన్నాయి పాట


చిత్రం :  పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

మనసు పాడింది సన్నాయి పాట
మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ ఆ ....

మనసు పాడింది సన్నాయి పాట

చరణం : 1

జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
జగమే కల్యాణ వేదికగా..సొగసే మందార మాలికగా
తొలిసిగ్గు చిగురించగా..ఆ ఆ ఆ ఆ
తొలిసిగ్గు చిగురించగా... నా అలివేణి  తలవాల్చిరాగ 

మనసు పాడింది సన్నాయి పాట...

చరణం : 2

చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
చిలికే పన్నీటి వెన్నెలలోనా.. పిలిచే విరజాజి పానుపుపైనా
వలపులు పెనవేసుకోగా..ఆ..
వలపులు పెనవేసుకోగా ... నా వనరాజు ననుచేర రాగా

మనసు పాడింది సన్నాయి పాట...

చరణం : 3

మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
మదిలో దాచిన మమతలతేనెలు.. పెదవులపైనే కదలాడగా
పెదవులకందనీ మధురిమలేవో..ఓ..ఓ... ఆ..
పెదవులకందనీ మధురిమలేవో .. హృదయాలు చవిచూడగా

మనసు పాడింది సన్నాయి పాట
కనులు ముకుళించగ... తనువు పులకించగా
గగనమే పూల తలంబ్రాలు కురిపించగా.. ఆ...ఆ ....

మనసు పాడింది సన్నాయి పాట
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=654

ఎంత సొగసుగా ఉన్నావూ



చిత్రం : పుణ్యవతి (1967)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎంత సొగసుగా ఉన్నావూ ...ఎలా ఒదిగిపోతున్నావూ
కాదనకా..ఔననకా..కౌగిలిలో దాగున్నావూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
 కాదనకా..అహా
 ఔననకా..ఆహా..
 కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ...

చరణం : 2

అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ..ఆ ఆ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ..ఆ ఆ
అందీ అందని హంసల నడకలు.. ముందుకు రమ్మనెనూ
చిందీ చిందని చిరుచిరు నవ్వులు ఎందుకు పొమ్మనెనూ
నీ తనువే.. తాకగనే.. నామది ఝుమ్మనెనూ 

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..

ఎంతసొగసుగా ఉన్నావూ...

చరణం : 2

తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ..ఆ ఆ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ..ఆ ఆ
తడిసీ తడియని నీలికురులలో..కురిసెనుముత్యాలూ
విరిసీ విరియని వాలుకనులలో..మెరిసెను నీలాలూ
పులకించే..పెదవులపై..పలికెను పగడాలూ

ఎంత సొగసుగా వున్నావూ..ఆహాహాహా..
ఎలా ఒదిగి పోతున్నావూ..ఆహహాహా...
కాదనకా..అహా
ఔననకా..ఆహా..
కౌగిలిలోదాగున్నావూ..
ఎంతసొగసుగా ఉన్నావూ... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=655


ఊహలేవో రేగే



చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, కవితాకృష్ణమూర్తి 

పల్లవి:

హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా

ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

చరణం : 1

ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనిగా

ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ...
ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
ఆదుకోవా అయిన దాన్నేగా

చరణం : 2

ఎందుకు ఏమిటి అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ  చెరిసగమైపోగా
ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ..

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా
హే... ఊహలేవోరేగే ఊపుతోననులాగే
వేడిసెగలైకాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ..

లలలాల.. లాలలాలా.. లలలాలా
లాలలాలలాలా లాలలాలలలాలా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=19026

Friday, September 27, 2013

నీ నవ్వు చెప్పింది





చిత్రం: అంతం (1992)

సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ

గీతరచయిత: సిరివెన్నెల

నేపథ్య గానం: బాలు


పల్లవి:


నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏవిటో

నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేవిటో

ఓ లాల లాల ఓ ఓ లాలాలాలాల


నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏవిటో

నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేవిటో



చరణం 1 :


నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ

ఓ... నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ

నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని


పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అని

ఏ తోడుకీ నోచుకోని నడకెంత అలుపో అని…




చరణం 2 :


నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ 

నల్లని నీ కనుపాపలలో ఉదయాలు కనిపించనీ 

వెన్నెల పేరే వినిపించని.. నడిరేయి కరిగించనీ


నా పెదవిలోనూ ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ

నీ సిగ్గు నా జీవితాన తొలిముగ్గు పెడుతుందనీ



చరణం 3 :



ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

ఆ... ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కునో

తనువు మనసు చెరిసగమని పంచాలి అనిపించునో

సరిగా అదే శుభముహూర్తం సంపూర్ణమయ్యేందుకు

మనమే మరో కొత్త జన్మం పొందేటి బంధాలతో



ఓ లాల లాల ఓ..ఓ లాలాలాలాల 

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏవిటో

నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేవిటో


చలెక్కి ఉందనుకో

చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర


పల్లవి:

చలెక్కి ఉందనుకో..ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో ఏ చిటారు కొమ్మనుకో
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....

చరణం 1:

చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా..
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా...
చీకటుందని చింతతో నడిరాతిరి నిదురోలేదుగా..
కోటిచుక్కల కాంతితో తన తూరుపు వెతుకునుగా..

నలుదిక్కులలో నలుపుందనుకో చిరునవ్వులకేం పాపం..
వెలుగివ్వననీ ముసుగేసుకొనీ మసిబారదు ఏ దీపం..

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....

చరణం 2:

కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన..
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా...
కారునల్లని దారిలో ఏ కలలకోసమో యాతన..
కాలు సాగని నింగిలో ఏకాకి యాత్రలోనా...

కలలన్నిటినీ పిలిపించుకొని నిలవేసి
నా కళ్ళనీ..
నెమరేసుకోని వెళ్ళీపోకుమరీ విలువైన విలాసాన్నీ...

చలెక్కి ఉందనుకో...ఏ చలాకి రాచిలకో..
చిటుక్కుమందనుకో...ఏ చిటారు కొమ్మనుకో....
చురుగ్గా చూస్తావో..పరాగ్గా పోతావో..
వలేస్తానంటావో..ఇలాగే వుంటావో....
చలెక్కి ఉందనుకో...ఏ....

గుండెల్లో దడదడ దడ

చిత్రం: అంతం (1992) 
సంగీతం: ఆర్.డి. బర్మన్ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు, చిత్ర 





పల్లవి: 

గుండెల్లో దడదడ దడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగ భగ భగ మండే మెరుపులతో 
ల ల ల లా ల లా 

ఊహల్ని ఉప్పొంగించే ఒత్తిడి చిత్తడి 
మబ్బుల్ని మత్తెకించే సుడిగాలి 
కొండల్ని ఢీకొట్టించే అల్లరి ఆవిరి 
దిక్కుల్ని దిమ్మెక్కించే తొలకరి 

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

చరణం 1: 

వెన్నెలంటే... వెండి మంటే...
వెన్నెలంటే వెండి మంటే... నిజమిదీ నమ్మవూ 
కన్నులుంటే నన్ను కంటే... రుజువులే కోరవూ 

ఆ..ఆ..ఆ..ఆ 

చీకట్లో జ్వలించిన చుక్కలా చేరునా 
ఏకాకి ఏకాంతంలో కలిసేలా 

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

చరణం 2: 

నిప్పు చెండై... చుట్టుకుంటే... 
నిప్పు చెండై చుట్టుకుంటే... కరగడా సూర్యుడు 
మంచు మంటై ముట్టుకుంటే... మరగడా చంద్రుడు 

ఆ..ఆ..ఆ..ఆ 

గంగమ్మ ఆయువునే తాగినా తగ్గునా 
సంద్రాన్ని ఆటాడించే చేడు దాహం

గుండెల్లో దడదడదడ లాడే ఉరుములతో 
కళ్ళల్లో భగభగ భగ మండే మెరుపులతో 

కమ్మని గీతాలే

చిత్రం: అంతం (1992) 
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: చిత్ర 

పల్లవి: 

ఓ మైనా ..... ఆ ఆ 
నీ గానం నే విన్నా ఆ ....ఆ ఆ 
ఎటు ఉన్నా...ఆ ఆ ఆ ..... ఏటవాలు పాట వెంట రానా ..... ఆ ఆ 

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే.....మరి రావే ఇకనైనా..... 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే.....కనిపించవు కాస్తైనా..... 
నీ కోసం వచ్చానే... సావాసం తెచ్చానే 
ఏదీ రా మరి ఏ మూలున్నా..... 

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే.....మరి రావే ఇకనైనా ..... 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే.....కనిపించవు కాస్తైనా ..... 
లాల్లలలల్లల్లా లాలలాలలలల్లల్లా లలలాలాలాలాలాలా ..... 

చరణం 1: 

ఎవరైనా...ఆ ఆ ఆ...చూశారా ఎపుడైనా...ఆ ఆ ఆ 
ఉదయానా....ఆ ఆ ఆ .....కురిసే వన్నెల వానా ....హో 

కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా.. 
ఒక్కొక్క తారా చినుకల్లె జారి... వెలిసింది తొలికాంతిగా.. ఆ ..... 
కరిమబ్బులాంటి నడిరేయి కరిగి కురిసింది కిరణాలుగా 
ఒక్కొక్క తారా చినుకల్లె జారి... వెలిసింది తొలికాంతిగా 
నీలాకాశంలో... వెండి సముద్రంలా... పొంగే ..... 

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే.....మరి రావే ఇకనైనా 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే.....కనిపించవు కాస్తైనా ..... 

చరణం 2: 

నన్నేనా....ఆ ఆ ఆ....కోరుకుంది ఈ వరాల కోనా.....హో 
ఏలుకోనా....ఆ ఆ ఆ....కళ్ళ ముందు విందు ఈ క్షణానా ....హో 

సీతాకోకచిలుకా తీసుకుపో నీ వెనుకా... వనమంతా చూపించగా... 
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక ...వివరించు ఇంచక్కగా ..... 
సీతాకోకచిలుక తీసుకుపో నీ వెనుక... వనమంతా చూపించగా.... 
ఆ మొక్క ఈ మొలక అన్నీ తెలుసు కనుక...వివరించు ఇంచక్కగా ..... 
ఈ కారుణ్యంలో నీ రెక్కే దిక్కై... రానా ..... 

కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే....మరి రావే ఇకనైనా 
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే....కనిపించవు కాస్తైనా 
నీ కోసం వచ్చానే...సావాసం తెచ్చానే... 
ఏదీ రా మరి... ఏ మూలున్నా ..... 

ఆహహహహ్హహ్హా ఓహోహోహోహోహ్హోహ్హో లలలాలా హ్మ్మ్...హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ 
డూడుడుడుడుడూ... ఓహోహొహొహొహొహో..హో ...లలలాలాలాలాలాలా...

ఎంతసేపైన ఎదురు చూపేన




చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర

పల్లవి:

ఎంతసేపైన ఎదురు చూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

ఎంతసేపైన ఎదురు చూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో...


పాపర... పా... పా.....పాపర...పా ...పా.......
పాపర... పా... పా.....పాపర...పా ...పా.......

చరణం 1:

ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా... ఆహా.. అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వెయ్యిమందున్నా.. ఓహో... ఒక్కదాన్నే వేగిపోతున్నా...
ఎన్నాళ్ళు ఈ యాతనా... ఎట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా... ఎట్టాగె ఎదురీదనా...
ఏలుకోడేవి నా రాజు చప్పునా ...హ ..హా...

ఎంతసేపైన ఎదురు చూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జు..జు...ఈ వేళ ఈ చోటనీ...రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో... ఏవిటో

చరణం 2:

హా...తోడులేని ఆడవాళ్ళంటే లా..ల.. కోడేగాళ్ళ చూడలేరంటా...
తోడేళ్ళే తరుముతూ ఉంటే ...తప్పుకోను త్రోవలేకుందే లా.ల..ల
ఓ ఊరంత ఉబలాటమూ... నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ... నా వెంటనే ఉన్నదే
ఏవిలాభం గాలితో చెప్పుకుంటే...

ఎంతసేపైన ఎదురు చూపేన ...నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ ...రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో....

Thursday, September 12, 2013

ఇదే పాటా ప్రతీ చోటా

చిత్రం: పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు

పల్లవి:

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 


ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను 
పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను 

చరణం 1:

నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
నా పాట విని మురిశావు ఆ పైన నను వలచావు
కలలాగ నను కలిశావు లతలాగ నను పెనవేశావు
ఒక గానమై ఒకప్రాణమై జతగూడి మనమున్నాము
ఉన్నాము ఉన్నాము

చరణం 2:

నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
నాడేమి ఉందని భ్రమశేవు నేడేమి లేదని విడిచేవు
ఆ మూడుముళ్లని మరిచేవు నా పాల మనసుని విరిచేవు
ఈనాడు నను విడనాడినా ఏనాటికైనా కలిసేవు నువు
కలిసేవు నను కలిసేవూ


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2014

Wednesday, September 11, 2013

నీ చూపులోనా విరజాజివానా

చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు, సుశీల, ఎస్. పి. శైలజ

పల్లవి:

నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా

చరణం 1:

ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
కనివిని ఎరుగని తలపులు చిగురించే...

నీ చూపులోనా.. విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. వడగళ్ల వానా
ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా

చరణం 2:

చిరుగాలిలోనా... చిగురాకు ఊగే
చెలి కులుకులోనా... పరువాలు ఊగే

ఈ పాల రేయీ... మురిపించె నన్ను...
మురిపాలలోనా... ఇరికించె నన్ను...

గిలిగింత కలిగించే... మనసంత పులకించే...
జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే...
చెరగని.. తరగని.. వలపులు కురిపించే...

నీ చూపులోనా... విరజాజివానా
ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా

నీ నవ్వులోనా... రతనాల వానా
ఆ వానలోనా నేను మరిచేనా... తీయగా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1857

రా రా కౌగిలి చేరా

చిత్రం: పిడుగు రాముడు (1966) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

నడకలో కొదమసింగపు అడుగులున్న మొనగాడా... 
మేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చినవాడా... 
మెరుపులున్న చినవాడా...రా...రా... 

రా రా కౌగిలి చేరా రా రా దొర...ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా 
రా రా కౌగిలి చేరా రా రా దొర...ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా..... 

చరణం 1: 

చలిగాలి వీచేను నీకోసమే... 
ఈ చెలి సైగ చేసేను నీ కోసమే... 
చలిగాలి వీచేను నీకోసమే... 
ఈ చెలి సైగ చేసేను నీ కోసమే.... 

మనసందుకో నా మరులందుకో... 
మనసందుకో నా మరులందుకో... 
ఓ..మగరాయడా నీకు బిగువెందుకో.... 

రా రా కౌగిలి చేరా రా రా దొర...ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా 

చరణం 2: 

పొదరిండ్లు నిను నన్ను రమ్మనవీ... 
నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవీ.... 
పొదరిండ్లు నిను నన్ను రమ్మనవీ... 
నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవీ.... 

మాటాడవా...సైయాటాడవా....మాటాడవా...సైయాటాడవా... 
నీ కొస చూపుతో నన్ను వేటాడవా.... 

రా రా కౌగిలి చేరా రా రా దొర...ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా... 
రా రా కౌగిలి చేరా రా రా దొర...ఈ రంగేళి ప్రాయంబు నీదేనురా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=85

మనసే వెన్నెలగా

చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన

చరణం 1:

విరిసే ఊహలలో.. పరువము నీవేలే
విరిసే ఊహలలో.. పరువము నీవేలే

మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే
మదనుడి కన్నులలో.. మగసరి నీదేలే

సైగలతో.. కవ్వించే.. జవ్వని నీవే..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన..

చరణం 2:

తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా
తలపుల పందిరిలో..ఓ.. కలలే కందామా

కరగని కౌగిలిలో.. కాపురముందామా
కరగని కౌగిలిలో.. కాపురముందామా

కనరాని.. తీరాలే.. కనుగొందామా..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన
వీడిన హృదయాలే.. కూడెను ఈ వేళ..ఆ..

మనసే వెన్నెలగా.. మారెను లోలోన..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=586

పిలిచిన పలుకవు

చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

పిలిచిన పలుకవు ఓ జవరాలా
పిలిచిన పలుకవు ఓ జవరాలా
చిలిపిగ నను చేర రావా... రావా..
పిలిచిన పలుకవు ఓ జవరాలా

కలువల రాయడు చూసే వేళ
కలువల రాయడు చూసే వేళ
చెలియను కవ్వింతు వేలా.. యేలా
కలువల రాయడు చూసే వేళా..

చరణం 1:

చల్లగ విరిసే నీ చిరునవ్వులు
చల్లగ విరిసే నీ చిరునవ్వులు .. మల్లెలు కురిసెను నాలోన

తొలిచూపులలో చిలికిన వలపులు
తొలిచూపులలో చిలికిన వలపులు.. తొందర చేసెను నీలోన..


పిలిచిన పలుకవు ఓ జవరాలా 
చిలిపిగ నను చేర రావా... రావా.. 
పిలిచిన పలుకవు ఓ జవరాలా 

చరణం 2:

జగములనేలే సొగసే నీదని...
జగములనేలే సొగసే నీదని.. గగనములో దాగే నెలరేడు

మనసును దోచే మరుడవు నీవని
మనసును దోచే మరుడవు నీవని.. కనుగొంటినిలే ఈనాడు...


పిలిచిన పలుకవు ఓ జవరాలా 
చిలిపిగ నను చేర రావా... రావా.. 
కలువల రాయడు చూసే వేళ 
చెలియను కవ్వింతు వేలా.. యేలా 
పిలిచిన పలుకవు ఓ జవరాలా 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=585

ఈ రేయి నీవు నేను

చిత్రం: పిడుగు రాముడు (1966)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..ఓ
ఓహో..హో.. ఓ..ఓ..ఓ..ఓ.. ఓహో..హో..
ఓ..ఓ..ఓ.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. హా..ఓ
ఓ..ఓ..ఓ.. ఓహో..హో..ఓ..ఓ.. ఓ..ఓహో..హో..ఓ.ఓ

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

చరణం 1:

ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో
ఏ మబ్బు మాటున్నావో.. ఏ పొదల చాటున్నావో
ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో
ఏ గాలి తరగలపైనా.. ఊగి ఊగి పోతున్నావో
కలగా.. నన్నే.. కవ్వించేవో..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

చరణం 2:

చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నానూ..ఊ..
చందమామలో ఉన్నాను.. చల్లగాలిలో ఉన్నాను
నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నానూ..ఊ..
నీ కంటి పాపలలోనా.. నేనూ దాగి ఉన్నాను
నీలో.. నేనై.. నిలిచున్నాను..ఊ ..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

చరణం 3:

ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నానూ..ఊ
ఆనాటి చూపులన్ని.. లోన దాచుకున్నాను
నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నానూ..ఊ
నీవు లేని వెన్నెలల్లోన నిలువజాలకున్నాను

కనవే.. చెలియా.. కనిపించేనూ

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..

ఈ రేయి నీవు నేను ఎలగైనా కలవాలి..
నింగిలోని తారలు రెండు నేలపైన నిలవాలి..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=584

ఓ కుర్రవాడా వెర్రివాడా

చిత్రం: పిచ్చిమారాజు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఓ కుర్రవాడా .. వెర్రివాడా 
ఓ కుర్రవాడా .. వెర్రివాడా 
ఎందుకిలా.. నువ్వెందుకిలా
నన్నొదిలి యిలా పారిపోతావు...

ఓ కుర్రదానా... వెర్రిదానా 
ఓ కుర్రదానా... వెర్రిదానా 
ఎందుకిలా.. నువ్వెందుకిలా
నన్నొదలకిలా తరుముకొస్తావూ...

చరణం 1:

నేలకి నింగికి కలవదమ్మా
నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా...
ఆ..నేలకి నింగికి కలవదమ్మా
నీకు నాకు పొత్తెపుడు కుదరదమ్మా.

నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము
నీకూ నాకూ ఉన్నది అదే బంధము... ఆహా..
నింగిలోని వెన్నెలంత నేలకే సొంతము
నీకూ నాకూ ఉన్నది అదే బంధము ....

ఓ కుర్రదానా... వెర్రిదానా
ఎందుకిలా.. నువ్వెందుకిలా
నన్నొదలకిలా తరుముకొస్తావూ...

చరణం 2:

చల్లగాలి ఊరుకోదు... పిల్లమనసు ఓర్చుకోదు..
ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను.. ఆపలేను...
చల్లగాలి ఊరుకోదు... పిల్లమనసు ఓర్చుకోదు..
ఓర్చుకోనీ పిల్లదాన్ని ఓపలేను ఆపలేను...

ఏం చేయమంటావు నన్ను...
నన్నెలా వదలమంటావు నిన్ను...

ఓ కుర్రవాడా .. వెర్రివాడా
ఎందుకిలా.. నువ్వెందుకిలా
నన్నొదిలి యిలా పారిపోతావు...

చరణం 3:

అందాలతో నాకు బంధాలు వేయకు
పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు....
అందాలతో నాకు బంధాలు వేయకు
పిచ్చివాణ్ణి మరీమరీ రెచ్చగొట్టకు....

రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది
ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది...
రెచ్చితే పిచ్చి ఎంతో ముచ్చటగ ఉంటుంది
ముచ్చటైన కౌగిట్లో పిచ్చి కుదిరిపోతుంది...

ఓ కుర్రదానా... వెర్రిదానా
ఎందుకిలా..నువ్వెందుకిలా
నన్నొదలకిలా తరుముకొస్తావూ...

ఓ కుర్రవాడా .. వెర్రివాడా
ఎందుకిలా.. నువ్వెందుకిలా
నన్నొదిలి యిలా పారిపోతావు..

ఓ కుర్రదానా... ఓ కుర్రవాడా...
ఓ వెర్రిదానా... ఓ వెర్రివాడా...
ఓ కుర్రదానా... ఓ కుర్ర వాడా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2412

Friday, September 6, 2013

ఆలపించనా అనురాగముతో

చిత్రం: పిచ్చి పుల్లయ్య (1953) గీతరచయిత: అనిసెట్టి 
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఆలపించనా అనురాగముతో...
ఆలపించనా అనురాగముతో... ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా... ఆలపించనా... ఆలపించనా

చరణం 1:

చక్కని పూవులు విరిసి ఆడగా... చల్లని గాలులు కలిసి పాడగా
పున్నమి వెన్నెల పులకరించగా... పుడమిని సుఖాలు పొంగులెగరగా...
ఆలపించనా

చరణం 2:

చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
అరమరలెరుగని అమాయకునిలో... అరమరలెరుగని అమాయకునిలో
ఆశయాలెవో అవతరించగా... ఆశయాలెవో అవతరించగా
ఆలపించనా....

చరణం 3:

కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
నిర్మల ప్రేమకు నివాళులెచ్చే... నిర్మల ప్రేమకు నివాళులెచ్చే
కాంతిరేఖలే కౌగలించగా.... కాంతిరేఖలే కౌగలించగా
ఆలపించనా ...

ఆలపించనా అనురాగముతో... ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా... ఆలపించనా

పాలవంక సీమలో

చిత్రం: పాల మనసులు (1968)
సంగీతం: సత్యం
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం 1:

రెక్కా రెక్కా ఆనించి ...రేయి పగలు విహరించి
రెక్కా రెక్కా ఆనించి... రేయి పగలు విహరించి
మిన్నులలో ఎగిసింది... అది వెన్నెలలో తడిసినది
మిన్నులలో ఎగిసింది... అది వెన్నెలలో తడిసినది

ఆ ...కోరికలూరే ఆ జంట... ఆరని ఆశల చలి మంట
కోరికలూరే ఆ జంట... ఆరని ఆశల చలి మంట ..
చల్లారని ఆశల... చలి మంట...

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం 2:

పచ్చని చిలకను చేరగనే... వెచ్చగ ఒదిగెను గోరింక
పచ్చని చిలకను చేరగనే... వెచ్చగ ఒదిగెను గోరింక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక
ముద్దుల జంటను చూడగనే... ముసిముసి నవ్వును నెలవంక

ఆ... కలకలాలాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట
కలకలా లాడే ఆ జంట... కమ్మని వలపుల తొలి పంట...
కమ్మని వలపుల... తొలి పంట


పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7023

అమ్మా చూడాలి

చిత్రం: పాపం పసివాడు (1972) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

అమ్మా చూడాలి...నిన్ను నాన్నను చూడాలి 
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి 
అమ్మా... అమ్మా... 

అమ్మా చూడాలి... నిన్ను నాన్నను చూడాలి 
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి 
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా... 

చరణం 1: 

ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను చూసే ఆశే లేదమ్మా... 
ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను చూసే ఆశే లేదమ్మా... 
నడవాలంటే ఓపిక లేదు... ఆకలి వేస్తోంది 
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా... 

చరణం 2: 

పలికేందుకు మనిషే లేడు... నిలిచేందుకు నీడే లేదు ... 
పలికేందుకు మనిషే లేడు ... నిలిచేందుకు నీడే లేదు ... 
బాధగా ఉంది భయమేస్తోంది.. ప్రాణం లాగేస్తోంది 
అమ్మా... అమ్మా...... 

అమ్మా చూడాలి... నిన్ను నాన్నను చూడాలి 
నాన్నకు ముద్దు ఇవ్వాలి... నీ ఒడిలో నిద్దురపోవాలి 
అమ్మా... అమ్మా... అమ్మా... అమ్మా..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6520