Thursday, February 27, 2014

టాటా వీడుకోలు

చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల

పల్లవి:

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
తొలినాటి స్నేహితులారా చెలరేగే కోరికలారా
టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు .. 

చరణం 1:

ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
ప్రియురాలి వలపులకన్నా నును వెచ్చనిదేదీ లేదని
నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది
ఆ  ఆ ప్రేమ నగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ కామ నగరుకి రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 2:

ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
ఇచ్చుటలో ఉన్న హాయి.. వేరెచ్చటనూ లేనే లేదని
లేటుగ తెలుసుకున్నాను.. నా లోటుని దిద్దుకున్నాను
ఆ ఆ స్నేహనగరుకే పోతాను .. పోతాను .. పోతాను
ఈ మోహనగరుకు రాను .. ఇక రాను

టాటా.. వీడుకోలు .. గుడ్ బై .. ఇంక సెలవు
టాటా.. వీడుకోలు ..

చరణం 3:

మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మధుపాత్రకి ఎదలో ఇంక ఏమాత్రం చోటు లేదని
మనసైన పిల్లే చెప్పింది .. మనసైన పిల్లే చెప్పింది
నా మనసంతా తానై నిండింది .. నా మనసంతా తానై నిండింది
నే రాగ నగరుకే పోతాను .. అనురాగ నగరుకే పోతాను .. పోతాను 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1162

No comments:

Post a Comment