Thursday, February 27, 2014

పయనించే మన వలపుల

చిత్రం :  బావమరదళ్ళు (1960)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

చరణం 1:

ఊ...ఊ...ఊ..ఊ..ఊ..
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో....
నెలబాలుని చిరునవ్వుల తెలివెన్నెల సోనలలో
చెలరేగే అలల మీద ఊయలలూగి...

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...

చరణం 2:

వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు...
వికసించె విరజాజులు వెదజల్లగ పరిమళాలు
రవళించె వేణుగీతి...రవళించె వేణుగీతి... రమ్మని పిలువ....

పయనించే మన వలపుల బంగరు నావ
శయనించవె హాయిగా జీవనతార...నా జీవనతార..ఆ..ఆ
పయనించే...ఉహు ఉహు..ఊ..ఉహు..ఉహు..ఊ...

No comments:

Post a Comment