Monday, February 10, 2014

విరిసిన వెన్నెలవో

చిత్రం: బందిపోటు దొంగలు (1968)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …
విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

చరణం 1:

సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా.. ఆ... ఆ... ఆ...
సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా..
అడుగడుగున హంసలు ఒయ్యారము లొలుకగా
వెదికే పెదవులతో .. తొణికే మధువులతో..
వెదికే పెదవులతో .. తొణికే మధువులతో
పొందుగోరి చెంతజేరి మురిపించే నా చెలీ …

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

చరణం 2:

కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో.. ఓ.. ఓ.. ఓ.. ఓ...
కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో..
ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో
నడిచే తీగియవై.. పలికే దీపికవై..
నడిచే తీగియవై... పలికే దీపికవై..
అవతరించి ఆవరించి అలరించే నా చెలీ ..

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో
తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో
విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …

No comments:

Post a Comment