Thursday, February 27, 2014

నా జీవన బృందావనిలో

చిత్రం :  బుర్రిపాలెం బుల్లోడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:

నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో

కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము
ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము

చరణం 1:

నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాట... వేణు గానమైపోతుంటే
నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే

మనసులో మధుర వయసులో యమున కలిసి జంటగా సాగనీ
మన జవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ

ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ
ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ
ఇదే రాసలీలా... ఇదే రాగడోలా
ఇదే రాసలీలా... ఇదే రాగడోలా

నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో

నా ప్రాణమంతా.. నీ వేణువాయె
పులకింతలన్నీ.. నీ పూజలాయె
ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో
ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో

చరణం 2:

ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే
ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే

రాగలహరి అనురాగనగరి రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి పదరేణువై చెలరేగనీ

నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా... అదే రాగడోలా
అదే రాసలీలా... అదే రాగడోలా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3685

No comments:

Post a Comment