Wednesday, March 5, 2014

జననీ జన్మభూమిశ్చ

చిత్రం :  బొబ్బిలి పులి (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు

పల్లవి:

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియసీ.. స్వర్గాదపీ గరియసీ
ఏ తల్లి నిను కన్నదో.. ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ.. స్వర్గాదపీ గరీయసీ

చరణం 1:

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టె కాలేవరకు.రా.

ఆ ఋణం తల కొరివితో తీరేనురా
ఈ ఋణం ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవానురా.. త్యాగానికి మరో రూపు నువు రా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ.. స్వర్గాదపీ గరీయసీ

చరణం 2:

గుండె గుండెకు తెలుసు.. గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు.. గుండె కోత బాధెంతో

నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి
మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం.. ఈ మనుషుల కోసం.. నీ మనుషుల కోసం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ స్వర్గాదపీ గరీయసీ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=362

No comments:

Post a Comment