Monday, March 17, 2014

ఆకులు పోకలు ఇవ్వద్దు

చిత్రం :  భార్య బిడ్డలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:

ఆ.. ఆ.. ఆ.ఆ.. ఓ.. ఓ..ఓహొ..ఓ...

ఆ.. ఆ.. ఆ.ఆ.. ఓ.. ఓ..ఓహొ..ఓ...


అతడు :


ఆకులు పోకలు ఇవ్వద్దు... 

నోరు ఎర్రగ చేయద్దుఆకులు పోకలు ఇవ్వద్దు... 

నా నోరు ఎర్రగ చేయద్దుఆశలు నాలో రేపద్దు... 

నా వయసుకు అల్లరి నేర్పద్దు... పాపా.. పాపా..


ఆమె : 


ఆకులు పోకలు ఇవ్వద్దు... 

నోరు ఎర్రగ చేయద్దుఆకులు పోకలు ఇవ్వద్దు... 

నా నోరు ఎర్రగ చేయద్దుఆశలు నాలో రేపద్దు...

నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...మావా


అతడు : పాపా...

ఆమె : మావా...


చరణం 1:

ఆమె  : 


ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు..
నే నోపలేనంతగా ఉడికించావు..
ఊరుకొన్న నన్ను నువ్వే ఊరించావు
నే నోపలేనంతగా ఉడికించావు


అతడు :


ఊరించానా ...నిన్నుడికించానా...
ఊరించానా ...నిన్నుడికించానా...
ఉత్తొత్తి నిందలేస్తే ఊరుకోనూ...
నాకుడుకెక్కిందంటే నేనూరుకోనూ... పాపా... పాపా..


ఆమె :


ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు


అతడు : 


ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...పాపా..పాపా..


ఆమె :  మావా..

అతడు :  పాపా...


చరణం 2:


అతడు : 


ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు
ఎర్రని పెదవిని పంట నొక్కకు
నన్ను వెర్రివాణ్ణి చేసి నీ వెంట తిప్పకు...


ఆమె: 


పంట నొక్కానా...నే వెంట తిప్పానా..
పంట నొక్కానా...నే వెంట తిప్పానా..
గజ్జల గుర్రమంటి కన్నె పిల్లకు
కళ్ళతోటి కళ్ళమేసి కదం తొక్కకూ... మావా... మావా..


అతడు :


ఆకులు పోకలు ఇవ్వద్దు...నా నోరు ఎర్రగ చేయద్దు


ఆమె :


ఆశలు నాలో రేపద్దు...నా వయసుకు అల్లరి నేర్పద్దు...మావా...మావా...


అతడు : పాపా...

ఆమె : మావా..


చరణం 3:


ఆమె :


ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను
ముద్దు ముద్దుగా నన్ను చూసుకున్నావు
వద్దు వద్దన్న నిన్ను నేనొదిలి పెట్టను...


అతడు :


వద్దన్నానా... ననొదలమన్నానా..
పొద్దంతా నీతోటే గడచిపోతది...
నీ ముద్దు మొగంతోనె నాకు పొద్దు పొడిచేది... పాపా.. పాపా
ఆకులు పోకలు ఇవ్వద్దు... నా నోరు ఎర్రగ చేయద్దు
ఆశలు నాలో రేపద్దు... నా వయసుకు అల్లరి నేర్పద్దు...
మావా... పాపా...
మావా.. పాపా...
హెయ్యా.... 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1683

No comments:

Post a Comment