Thursday, March 20, 2014

రివ్వున సాగే

చిత్రం :  మంగమ్మ శపధం (1965)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల


పల్లవి:


ఓ ..ఓ.. ఓ... ఓ... ఓ..
ఓ... ఓ ఓ ఓ... ఓ ఓ హొయ్ ...
రివ్వున సాగే... రెపరెపలాడే యవ్వనమేమన్నదే...
పదే పదే సవ్వడి చేయుచున్నదే... ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే...
పదే పదే సవ్వడి చేయుచున్నదే... ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే....


చరణం 1:


పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
పైరుగాలివోలె మనసు పరుగులు పెడుతున్నది
కొడెతాచువోలె వయసు కుబుసం విడుతున్నది
 సొగసైన బిగువైన ... నాదే నాదే
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే..
పదే పదే సవ్వడి చేయుచున్నదే... ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే...


చరణం 2:


నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
ఓ... ఓ... ఓ ...ఒహొహొ
ఓ ఓ ఓ ఒహొ హొహొ ఒహొ హొహొ ఓ.. ఓ
నా పరువం సెలయేరుల నడకల వలె వున్నది
నా రూపం విరజాజుల నవ్వుల వలె వున్నది
జగమంతా అగుపించెద ... నేనే నేనే
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ ఓ
రివ్వున సాగే...


చరణం 3:


నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నీలి నీలి మబ్బులనే మేలిముసుగు వేతునా
తారలనే దూసి దూసి దండలుగా చేతునా
నేనన్నది కాలేనిది ...ఏదీ ఏదీ ...
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే
పదే పదే సవ్వడి చేయుచున్నదే ఓ ఓ ఓ ఓ...
రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమేమన్నదే



No comments:

Post a Comment