Sunday, March 30, 2014

విను నా మాట

చిత్రం :  మంచి మనుషులు (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి:


విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..


విను నా మాట.. విన్నావంటే..ఏ..
జీవితమంతా..ఆ..ఆ పూవ్వుల బాట..


చరణం 1:


ఎన్నడు నీవు ఏడవకూ..కన్నుల నీరు రానీకు
ఎన్నడు నీవు ఏడవకూ..కన్నుల నీరు రానీకు
కష్టాలందూ నవ్వాలి..కలకల ముందుకు సాగాలీ..


కంటికి వెలుగూ..ఇంటికి వెలుగూ.. ఆరని జ్యోతి..నువ్వే..నువ్వే..
విను నా మాట విన్నావంటే.. జీవితమంతా పూవ్వుల బాట


చరణం 2:


బిడ్డలు ముద్దుగా పెరగాలీ..పెద్దల ముచ్చట తీర్చాలీ
బిడ్డలు ముద్దుగా పెరగాలీ..పెద్దల ముచ్చట తీర్చాలీ
ఆటలు హాయిగ ఆడాలి..చదువులు పెద్దవి చదవాలీ


ఇంటికి పేరూ..ఊరికి పేరూ..తెచ్చేవాడివి నువ్వే నువ్వే..
విను నా మాట విన్నావంటే.. జీవితమంతా పూవ్వుల బాట


చరణం 3:


తల్లీతండ్రి ఒకరయినా..దైవసమానం తల్లి సుమా..
తల్లీతండ్రి ఒకరయినా..దైవసమానం తల్లి సుమా..
దీవిస్తుంది మీ అమ్మ..దేవునిలాగే కనపడక..
చల్లని మనసూ..తీయని మమత..చక్కని బ్రతుకూ..
నీదే..నీదే..


ఇది నీమాట..ఆ..విన్నానంటే..ఏ..జీవితమంతా..ఆ..పూవ్వుల బాటా
ఇది నీమాట విన్నానంటే జీవితమంతా పూవ్వుల బాటా...

No comments:

Post a Comment