చిత్రం : మంగమ్మ శపధం (1965) సంగీతం : టి.వి. రాజు గీతరచయిత : సినారె నేపధ్య గానం : సుశీల
పల్లవి:
అందాల నా రాజ అలుకేలరా.. ఔనని కాదని అనవేలరా..ఆ..ఆ.. అందాల నా రాజ అలుకేలరా.. ఔననీ.. కాదని అనవేలరా..ఆ..ఆ.. అందాల నా రాజ అలుకేలరా.. ఆ..ఆ..ఆ..ఆ..
చరణం 1:
చందురుడాపైన సందడి చేసేను.. డెందములోలోన తొందర చేసేను..అందని వలపులు గంధము పూసేను..ఆ..ఆ..ఆ..అందని వలపులు గంధము పూసేను.. సుందరి జాలిగ చూసేనురా..ఆ.. అందాల నా రాజ అలుకేలరా...ఆ
చరణం 2:
మరులను చిలికించు చిరునవ్వులేమాయే..
మనసును కవ్వించు కనుసన్నలేమాయే..మదనుని తూపులు మరి మరి పదునాయే..ఆ..ఆ..ఆ..మదనుని తూపులు మరి మరి పదునాయే.. మౌనము చాలించి నన్నేలరా..ఆ.. అందాల నా రాజ అలుకేలరా.. ఔననీ.. కాదని అనవేలరా..అందాల నా రాజ అలుకేలరా.. ఆ..ఆ..ఆ..ఆ..
No comments:
Post a Comment