Sunday, March 16, 2014

మది ఉయ్యాలలూగే

చిత్రం : భలే అమ్మాయిలు (1957)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపధ్య గానం :  ఘంటసాల, పి. లీల

పల్లవి:

మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహో...
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే
మానసమానందమాయెనహొ...
మది ఉయ్యాల...

ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 1:

తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమో
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా... ప్రణయమిదేనా
నూతన యవ్వన సమయమున
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 2:

చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోనా
చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోనా

ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

చరణం 3:

ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా ఆ
రేయి పగలు నే నిను మురిపించి నిను వలపించి
ప్రేమ జగానికి కొనిపోనా

మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=507

No comments:

Post a Comment