Wednesday, March 5, 2014

తెల్లాతెల్లని చీరలోన చందమామా

చిత్రం :  బొబ్బిలి పులి (1982)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:

తెల్లచీరలో... ఎన్ని సిగ్గులో...
మల్లెపూలలో...ఎన్ని పిలుపులో...

పిలుపు పిలుపులో... ఎన్ని వలపులో... ఓ.. ఓ...
వలపు తలపులో... ఎన్ని మలుపులో.. ఓ.. ఓ...

తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...
తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...

సూరీడొచ్చి రమ్మంటాడే చందమామా...
సూరీడొచ్చి రమ్మంటాడే చందమామా...
చూసిందల్లా ఇమ్మంటాడే చందమామా...

తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...

చరణం 1:

పువ్వు పువ్వులో.. ఎన్ని రేఖలో...
రేఖ రేఖలో.. ఎన్ని రూపులో..
పువ్వు పువ్వులో.. ఎన్ని రేఖలో...
రేఖ రేఖలో.. ఎన్ని రూపులో..

ఊపు ఊపులో.. ఎన్ని చూపులో...
చూపు చూపులో.. ఎన్ని ఆశలో..
ఆశే నువైతే...ఏ...నువ్వే నేనౌతా...ఆ...
    నేనే నువ్వౌతా...

తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...
తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...

చరణం 2:

సంధ్య సంధ్యకు.. ఎన్ని రంగులో...
రంగు రంగులో.. ఎన్ని కాంతులో...
సంధ్య సంధ్యకు.. ఎన్ని రంగులో...
రంగు రంగులో.. ఎన్ని కాంతులో...

సృష్టి సృష్టికి.. ఎన్ని మార్పులో...
నిన్న రేపుకి.. ఎన్ని చేర్పులో...
నిన్నే నువ్వైతే... నేడే నేనౌతా...
ఆ...నేనే నువ్వౌతా..

తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...
సూరీడొచ్చి రమ్మంటాడే చందమామా...
చూసిందల్లా ఇమ్మంటాడే.. ఆ.. చందమామా...

తెల్లాతెల్లని చీరలోన చందమామా...
పట్టాపగలు వచ్చినావే చందమామా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=873

No comments:

Post a Comment