Thursday, March 20, 2014

నీ రాజు పిలిచెను

చిత్రం :  మంగమ్మ శపధం (1965)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ.. ఊఁహూఁహూఁ..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా
ఆ.. ఆ.. ఆ..
నా రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా..ఆ.. ఇక నీ రాణి నేనే కదా


చరణం 1:


నిన్ను చూచి నీ వన్నె చూచి.. నను నేనె మరిచేనులే
నను నేనే మరిచేనులే..
ఈనాటికైనా ఏనాటికైనా...
ఈనాటికైనా ఏనాటికైనా.. నేనే.. నీలో.. నిలిచేనులే..
నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా


చరణం 2:


ఇన్నినాళ్ళు ఈ నీలి కళ్ళు.. ఏ కోనలో దాగెనో..ఓ..
ఏ కోనలో దాగెనో..
నే కోరుకున్న నా స్వామి కోసం..
నే కోరుకున్న నా స్వామి కోసం.. ఈ కళ్ళు ఇన్నాళ్ళు వేచేనులే..
నీ రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను
ఈ రేయి నీదే కదా..ఆ.. చెలి నా రాణి నీవే కదా
ఆ.. ఆ.. ఆ..
నా రాజు పిలిచెను.. రేరాజు నిలిచెను
ఈ రేయి నాదే కదా..ఆ.. ఇక నీ రాణి నేనే కదా
ఆ.. ఆ.. ఆ.. ఆహాహా..
ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..
ఆ.. ఆ.. ఆ.. ఆహాహా..
ఊఁ.. ఊఁ.. ఊఁ.. ఊఁ..


No comments:

Post a Comment