Thursday, March 20, 2014

చందురుడు నిన్ను చూసి

చిత్రం :  మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


చందురుడు నిన్ను చూసి చేతులెత్తాడు
చందురుడు నిన్ను చూసి  చేతులెత్తాడు
తన అందం నీలో చూసి.. తడబడిపోయాడు.. తబ్బిబ్బైయ్యాడు
ఔనా .. ఏమో..
ఔనా .. ఏమో..
గోదారి నిన్ను చూసి  గుసగుసలాడింది
గోదారి నిన్ను చూసి గుసగుసలాడింది
తన వేగం నీలో చూసి తడబడిపోయింది.. తబ్బిబ్బైయింది
ఔనా.. ఏమో..
ఔనా.. ఏమో..


చరణం 1:


ఎవరికి లొంగని మగసిరిలో.. ఎన్నడు తరగని సుగుణంలో
ఎవరికి లొంగని మగసిరిలో.. ఎన్నడు తరగని సుగుణంలో
రాముడివే నీవు.. ఆ రాముడివే నీవు...
ఏ రాముడు... అగ్గి రాముడా... బండ రాముడా..
అడవి రాముడా... శృంగార రాముడా...
ఉహు...ఉహు...ఉ...ఉ...ఉ..ఉ...ఉ...ఉ..
అయోధ్యా రాముడివే... ఆ సీతా రాముడివే


గోదారి నిన్ను చూసి.. గుసగుసలాడింది
తనవేగం నీలో చూసి.. తడబడిపోయింది... తబ్బిబ్బైయింది


చరణం 2:


భామలు మెచ్చిన రసికతలో... ప్రేమలు పంచిన చతురతలో..
భామలు మెచ్చిన రసికతలో... ప్రేమలు పంచిన చతురతలో
కృష్ణుడివే నీవు... ఆ కృష్ణుడివే నీవు...


ఏ కృష్ణుడు... చిలిపి కృష్ణుడా... కొంటె కృష్ణుడా...
భలే కృష్ణుడా... గోపాల కృష్ణుడా?


ఉహు...ఉహు...ఉ...ఉ...ఉ..
ఉ...ఉ...ఉ..

బృందావన కృష్ణుడివే... ఆ రాధాకృష్ణుడివే...


చందురుడు నిన్ను చూసి... చేతులెత్తాడు
తన అందం నీలో చూసి... తడబడిపోయాడు.. తబ్బిబ్బైయ్యాడు
అహ...అహ...

No comments:

Post a Comment