Sunday, March 30, 2014

చెప్పాలనుంది చెప్పేదెలా

చిత్రం :  మంచి రోజు (1970)
సంగీతం : ఎం.బి.శ్రీరాం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్

పల్లవి:

చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?

చిలకమ్మ నువ్వైన చెప్పే...  తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా...  సిగ్గెందుకో నాకిలా?

చరణం 1:

ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
ఆ చూపు మెరుపు..ఆ మేని విరుపు.. కలనైన మరచేదెలా?
పులకించి వయసు.. పిలిచింది పిలుపు.. వినకుంటే కలిసేదెలా?

ఆ... ఆ... ఆ.. చెప్పాలనుంది చెప్పేదెలా సిగ్గెందుకో నాకిలా

చరణం 2:

అందాల కొమ్మ అపరంజి బొమ్మ...  నా చేతికందాలిగా
అందాల కొమ్మ అపరంజి బొమ్మ... నా చేతికందాలిగా
నా మూగ మనసు ఇకనైన తెలిసి... నా చెంత చేరాలిగా..

ఆ.. ఆ.. ఆ... చెప్పాలనుంది చెప్పేదెలా ... సిగ్గెందుకో నాకిలా?
చిలకమ్మ నువ్వైన చెప్పే ... తనకోసమే నేననీ
చెప్పాలనుంది చెప్పేదెలా... సిగ్గెందుకో నాకిలా?

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4637

No comments:

Post a Comment